News
News
వీడియోలు ఆటలు
X

అప్పుడు పూరీ, ఇప్పుడు సూరి - నమ్మిన హీరోలను నట్టేట ముంచేసిన స్టార్ డైరెక్టర్స్

విజయ్ దేవరకొండకు పూరీ 'లైగర్' వంటి ప్లాప్ చిత్రాన్ని అందిస్తే, ఇప్పుడు అఖిల్ కు సూరి 'ఏజెంట్' వంటి పరాజయాన్ని అందించారు. హీరోల నమ్మకాన్ని ఇద్దరు దర్శకులు వమ్ము చేసారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. హిట్టిచ్చినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించిన వారే, ప్లాప్ వచ్చినప్పుడు దారుణంగా విమర్శలు చేస్తారు. అది స్టార్ హీరో అయినా సరే, అగ్ర దర్శకుడైనా సరే.. ఒక్క డిజాస్టర్ పడిందంటే చాలు, గతంలో ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ అన్నింటినీ మర్చిపోతారు. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చిందటే, టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దర్శకులు ఇద్దరు రెండు భారీ ప్లాప్స్ అందుకోవడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్లెవరో కాదు పూరీ జగన్నాథ్, సురేందర్ రెడ్డి. 

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. దాదాపు అందరికీ తమ కెరీర్ ని టర్న్ చేసే బ్లాక్ బస్టర్ అందించారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పూరీ.. గతేడాది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'లైగర్' మూవీ తెరకెక్కించాడు. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో రియల్ బాక్సర్ గా కనిపించడం కోసం VD రెండేళ్లపాటు చాలా కష్టపడ్డాడు. హార్డ్ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేసి సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. 

పూరీ చెప్పాడని ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇవ్వడానికి, నత్తితో ఇబ్బంది పడే యువకుడిగా నటించడానికి కూడా వెనకాడలేదు విజయ్. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి తన భుజాన వేసుకొని దేశమంతా తిరుగుతూ ప్రమోషన్స్ చేసాడు. కానీ ఏం లాభం. వీడీ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు హీరో మార్కెట్ ని దెబ్బ తీయడమే కాకుండా, ఎన్నడూ లేనంత నెగిటివిటీని తెచ్చిపెట్టింది.

'లైగర్' సినిమాకు దేవరకొండ విజయ్ ఎంత చేయాలో అంతా చేసాడు. కానీ స్టోరీ, డైరెక్షన్ వీక్ గా ఉండటంతో జనాలు రిజెక్ట్ చేసారు. దీనంతటికీ పూరీ జగన్నాథ్ కారణమని రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. పాన్ ఇండియా మోజులో అనవసరమైన ఆడంబరాలకు పోయి కంటెంట్ ను వదిలేశాడని కామెంట్స్ చేసారు. తన బలాలైన పంచ్ డైలాగులు, ఎలివేషన్స్ ను పక్కనపెట్టేసి.. హీరోకి నత్తి పెట్టేసి, తోలుబొమ్మని ఆడించినట్టు ఆడించాడని విమర్శించారు.

మరోవైపు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. టాలీవుడ్ స్టైలిష్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే కాస్త గ్యాప్ తీసుకొని యూత్ కింగ్ అఖిల్ అక్కినేనితో 'ఏజెంట్' మూవీ తీసాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం అఖిల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయకుండా, రెండేళ్ల పాటు కఠినమైన హార్డ్ వర్క్ చేసిన కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేసాడు. అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ తో అందరితో వావ్ అనిపించుకున్నాడు. 

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో హిట్ దక్కడంతో.. ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలని ఆశ పడ్డాడు అక్కినేని వారసుడు. కానీ అతనికి నిరాశే ఎదురైంది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఏజెంట్' సినిమా పూర్ కలెక్షన్స్ తో డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. దీంతో అఖిల్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా బడ్జెట్ ఎక్కువైనా భరించిన నిర్మాతకు నష్టాలు మిగిలే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం ఎవరంటే అందరి వేళ్ళూ ఇప్పుడు దర్శకుడు సూరి వైపే చూపిస్తున్నాయి. కనీసం సాంగ్ ప్లేస్ మెంట్స్, డబ్బింగ్ కూడా చూసుకోలేదని అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

ఏదైతేనేం అప్పుడు విజయ్ దేవరకొండకు పూరీ ఎలాంటి ప్లాప్ ఇచ్చాడో.. ఇప్పుడు అఖిల్ అక్కినేనికి సూరీ కూడా అలాంటి పరాజయాన్నే అందించాడు. ఇద్దరు హీరోల కెరీర్ లోనే అతిపెద్ద భారీ ప్లాప్స్ ను ఇచ్చారు. ఇప్పటి వరకూ టైర్-2 హీరోల లిస్టులో ఉన్న VD, అఖిల్.. స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి టాప్ లీగ్ లో చేరొచ్చని ఆశ పడ్డారు. వాళ్ళు చెప్పిందే చేసారు. కానీ రిజల్ట్ మాత్రం అందుకు తగ్గట్టుగా రాలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు కుర్ర హీరోలు నమ్మి తమ కెరీర్ ని వాళ్ళ చేతిలో పెడితే, నట్టేట ముంచేసారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : అఖిల్‌ను మళ్ళీ రీ లాంచ్ చేయాల్సిందేనా... ఆర్‌సీబీ కప్పు, అఖిల్ హిట్ కొట్టడం కలేనా? - ఇంత దారుణమైన ట్రోల్స్ చూసి ఉండరు!

Published at : 30 Apr 2023 07:30 PM (IST) Tags: Vijay Devarakonda Akhil Akkineni Liger Agent Puri Jagannath Surender Reddy

సంబంధిత కథనాలు

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !