అన్వేషించండి

అఖిల్ అక్కినేని పెళ్లి ఫిక్స్ - ఈసారి క్లారిటీ ఇచ్చేశాడా?

ఇటీవల అఖిల్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందంటూ వరుసగా వార్తలు వచ్చాయి. దీంతో ఈసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ కంన్ఫర్మ్ అనుకున్నారంతా అయితే ఈ వార్తలపై అఖిల్ స్వయంగా స్పందించారు.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అక్కినేని అఖిల్ ఒకరు. అఖిల్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అధికారికంగా ప్రకటన చేయడం లేదు. దీంతో అఖిల్ పెళ్లి గురించిన వార్తలు పరిపాటిగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అఖిల్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందంటూ వరుసగా వార్తలు వచ్చాయి. దీంతో ఈసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ కంన్ఫర్మ్ అనుకున్నారంతా. అయితే ఈ వార్తలపై అఖిల్ స్వయంగా స్పందించారు. అఖిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ప్రస్తుతం అఖిల్ సెలబ్రెటీల క్రికెట్ లీగ్ 2023 లో దూసుకుపోతున్నారు. తెలుగు వారియర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆటలో అదరగొడుతున్నారు. ఈ సందర్బంగా తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడారు అఖిల్. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ ఆమెతోనే పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తన పెళ్లిపై గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్నాయని అన్నారు. అయితే అవన్నీ ఫేక్ అని, ప్రస్తుతానికి తనకు పెళ్లి గురించి ఆలోచన లేదని అన్నారు.

తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, క్రికెట్ స్ట్రెస్ బస్టర్ అని అఖిల్ చెప్పారు. అందుకే తనతో క్రికెట్ ఆడేందుకు 15 మంది టీమ్ కూడా ఉందని అన్నారు. తన చిన్నప్పటి నుంచీ ఆ బ్యాచ్ అలాగే కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. వారానికి రెండు మూడు సార్లు క్రికెట్ ఆడతానని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం తనకు నచ్చనదన్నారు. అందుకే వ్యక్తిగత పోస్టుల కంటే వృత్తిపరమైన పోస్టులే ఎక్కువగా పెడుతుంటానని చెప్పారు. తాను ఇంకొన్నాళ్లు సింగిల్ గానే ఉండాలనుకుంటున్నానని, తన దృష్టిలో లవ్ అంటే స్పోర్ట్స్ లాంటిదేనని వ్యాఖ్యానించారు. అఖిల్ మాటలతో ఆయన పెళ్లిపై వస్తోన్న వార్తలకు చెక్ పడినట్లైంది. 

వాస్తవానికి అఖిల్ ఇప్పటికే ఓ ఇంటివాడు కావాల్సింది. ఆరు సంవత్సరాల క్రితం తన మాజీ ప్రేయసి శ్రియా భూపాల్ తో అఖిల్ కు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి చాలా  మంది సెలబ్రెటీలు కూడా వచ్చారు. వచ్చే ఏడాది గ్రాండ్ గా వివాహం కూడా చేయడానికి ప్లాన్ చేశారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పటి నుంచీ అఖిల్ సింగిల్ గానే ఉంటున్నారు. ఈ మధ్య అఖిల్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ వస్తోన్న వార్తలపై కూడా తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. 

ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమాలో నటించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.  ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టీ ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఏప్రిల్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget