అన్వేషించండి

Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటోన్న అజీత్ - కొత్త సినిమా పోస్టర్ అదుర్స్.. నిర్మాతలు మనోళ్లే!

Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘విడా ముయర్చి’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇంతలోనే తన అప్‌కమింగ్ మూవీ ఒక యంగ్ డైరెక్టర్‌తో ప్రకటన విడుదలయ్యింది.

Ajith Kumar - Adhik Ravichandran: కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్.. సినిమాల విషయంలో ఎప్పుడూ పెద్దగా తొందరపడలేదు. ఎప్పుడూ నిదానంగానే ఒక సినిమా అయిపోయిన తర్వాతే మరొకదాని గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం తను ‘విడా ముయర్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తవ్వక ముందే తన అప్‌కమింగ్ మూవీపై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అజిత్.. తన కెరీర్‌లోని 63వ చిత్రం కోసం ఒక యంగ్ డైరెక్టర్‌తో చేతులు కలపనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

డిఫరెంట్ టైటిల్..

అజిత్.. తన కెరీర్‌లోని 63వ చిత్రం కోసం యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలపనున్నారు. అధిక్.. ఇప్పటికే విశాల్ హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాను తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇక అజిత్, అధిక్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. దీనికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌ను నిర్మాతలతో పాటు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 2024 జూన్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, 2025 సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adhik Ravichandran (@adhikravi)

ఎమోషనల్ మూమెంట్..

అధిక్ రవిచంద్రన్‌కు అజిత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ విషయాన్ని చాలాసార్లు తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు కూడా. అంతలా తనను అభిమానించే హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కినందుకు అధిక్ సంతోషానికి హద్దులు లేవు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన సంతోషాన్ని బయటపెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘‘ప్రతీ ఒక్కరి జీవితంలో, కెరీర్‌లో మర్చిపోలేని సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ నా జీవితంలో మాత్రం ఇది నమ్మలేని విషయం. అజిత్ సార్‌తో పనిచేయడం అనేది నా కల. అలాంటిది ఆ కల నెరవేరుతుండడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అని అజిత్‌తో మరోసారి తన అభిమానాన్ని బయటపెట్టాడు అధిక్.

‘మార్క్ ఆంటోనీ’తో గుర్తింపు..

ఇక ఇప్పటికే ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం వల్ల అధిక్ రవిచంద్రన్ టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు తెలిసింది. టైమ్ ట్రావెల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం క్లీన్ హిట్‌ను అందుకుంది. ఇందులో విశాల్ హీరోగా నటించగా రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా కనిపించారు. ఎస్‌జే సూర్య విలన్ పాత్ర పోషించాడు. ‘మార్క్ ఆంటోనీ’ ప్రమోషన్స్ సమయంలో అధిక్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు విశాల్. దీంతో కోలీవుడ్ మేకర్స్‌లో తనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ సైతం తన సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు.

Also Read: నేను పాత వార్త అయిపోకూడదు, ఆ భయాన్ని అధిగమించాలి - సమంత

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget