అన్వేషించండి

Sathya Sri: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, 'నా పెట్టే తాళం' సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్

Sathya Sri: నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీలో ఓ పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ పాటలో నటించిన శ్రీసత్య పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Actress Sathya Sri on Extra Ordinary Man Movie Naa Pette Talam Tesi Song: నితిన్ హీరో వక్కంతం వంశీ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఈ మూవీలోని ఓ పాట తీవ్ర చర్చకు కారణం అయ్యింది. ఓ బూతు పాటను సినిమాలో పెట్టడం ఏంటనే విమర్శలు వచ్చాయి. అదీ అమ్మాయిలతో ఆ పాటకు స్టెప్పులు వేయించడం ఏంటని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుకున్నది వేరు, జరిగింది వేరు- సత్యశ్రీ

తాజాగా ఈ పాట వివాదం గురించి నటి సత్యశ్రీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ పాటలో ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించింది. “ఈ పాట మూడు రోజుల్లో షూట్ చేస్తారనగా నాకు సినిమా యూనిట్ నుంచి కాల్ వచ్చింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారని అనుకున్నాం. ఈ క్యారెక్టర్ కు డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. స్విచ్చువేషన్ కు తగినట్లుగా ఈ పాట వస్తుంది అని చెప్పారు. నేను కూడా సరే అన్నాను. రేపు షూట్ అనగా, ఈ రోజు సాంగ్ ఏంటండీ అని అడిగాను. వాళ్లు ఇదీ సాంగ్ అని చెప్పారు. నా ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. రేపు పాట షూట్. చేస్తానని ఒప్పుకున్న. కాస్ట్యూమ్స్ కూడా వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా, షూట్ కి వెళ్లాను. మొదట్లో నితిన్ తో ఓ సీన్ లో నటించాను. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చారు. మంచి క్యారెక్టర్ వచ్చింది చెయ్ అన్నారు. పాట ప్లే చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది. నాకు ఎక్స్ ప్రెషన్స్ రావట్లేదు. శేఖర్ మాస్టర్ వచ్చి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని చెప్పారు. అయినా, నేను చేయలేకపోతున్నాను. 15 టేకులు తీసుకున్నాను. ఎక్స్ ప్రెషన్స్ రావట్లేదు. అప్పుడు దర్శకుడు వంశీ వచ్చి, సత్య నిన్ను ఎక్స్ పోజింగ్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ సెక్సీ లుక్స్ ఇవ్వు చాలు అన్నారు. నన్ను నమ్ము, వల్గారిటీ ఉండదు అని చెప్పారు. ఆయన చెప్పినట్లే చేశాను. మూడు రోజులు షూట్ చేశాం. నేను భయపడినంతగా ఏమీ లేదు. చాలాసార్లు దర్శకుడిని అడిగాను, ఈ పాట వేరేలా జనల్లోకి వెళ్లదు కదా అని. ఆయన లేదని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హీరో నితిన్ కూడా చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు” అని చెప్పుకొచ్చింది.  

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సాంగ్ పై తీవ్ర విమర్శలు

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఇంటర్వెల్ తర్వాత  చమ్మక్ చంద్రతో పోలీస్ స్టేషన్‌ సన్నివేశం ఉంటుంది. దానికి ముందు రోడ్డు మీద లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరితో అసభ్యంగా మాట్లాడటంతో హీరో బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. తాళం ఉన్నప్పటికీ...  లేదని చెప్పి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు 'నా పెట్టి తాళం తీసి' సాంగ్ వస్తుంది. ఆ పాటకు 'జబర్దస్త్' ద్వారా పాపులరైన సత్య శ్రీ, 'విరూపాక్ష' ఫేమ్ సోనియా సింగ్ డ్యాన్స్ చేశారు. ఈ పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

Read Also: ఇష్టం లేకపోతే చూడకండి, ‘యానిమల్’ విమర్శలపై త్రిప్తి దిమ్రి ఘాటు వ్యాఖ్యలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget