అన్వేషించండి

Samantha: గడ్డకట్టే ఐస్ వాటర్‌లో సమంత డేరింగ్ స్టంట్ - ట్రీట్మెంట్ మొదలు!

నటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఇండినోషియా బాలిలో విహార యాత్రలో గడుపుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ పర్యాటక ప్రదేశాను సందర్శిస్తూ విశ్రాంతి పొందుతోంది. రీసెంట్ గా. ఆమె..

Samantha: నటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ప్రస్తుతం ఇండినోషియా బాలిలో విహార యాత్రలో గడుపుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ పర్యాటక ప్రదేశాను సందర్శిస్తూ మానసిక విశ్రాంతి పొందుతోంది సమంత. ఆమె ట్రిప్ లు, టూర్ లకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది సామ్. ఆమె ఇటీవల మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఐస్ బాత్ చేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

4 డిగ్రీల ఐస్ వాటర్ లో 6 నిమిషాల పాటు..

సమంత ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. సినిమాల్లో అయినా నిత్య జీవితంలో అయినా చాలా డేరింగ్ గా ఉంటుంది సమంత. సాహసాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదు. సినిమా షూటింగ్ లలో కూడా అలాంటి సాహసాలు చేసి గాయాలపాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వెకేషన్ లో ఉన్న సమంత రీసెంట్ గా జిమ్ లో యాక్రోబాటిక్ స్టంట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మరో సాహసోపేతైన యాక్టివిటీ చేసి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. నాలుగు డిగ్రీల ఐస్ వాటర్ లో దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సమంత. మామూలుగా కాస్త చలిగా ఉంటేనే చాలా మంది నీటిలో తడవడానికి భయపడుతుంటారు. అలాంటిది సమంత అన్ని నిమిషాల పాటు అలా ఐస్ వాటర్ లో ఉండటం చూసి ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

సినిమాలకు దూరంగా అభిమానులకు దగ్గరగా..

సమంత సినిమాలకు దూరం అవుతుందనే వార్త వచ్చినప్పటి నుంచీ ఆమె అభిమానులు ఆందోళన వ్యకం చేశారు. సామ్ ను మిస్ అయిపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. అయితే ఆమె సినిమాలకు దూరం అయింది కానీ అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉందని చెప్పాలి. సమంత ‘ఖుషీ’, ‘సిటాడెల్’ షూటింగ్ లు పూర్తి చేసిన తర్వాత ఇక ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతుందేమో అని అనుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ నుంచి తన విశేషాలను, సరదా కబుర్లను అభిమానులకు ఎప్పటికప్పుడు చెబుతూ వాళ్లతో టచ్ లో ఉంటుంది. ఈ మధ్య ఆమె వెళ్లిన ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించిన ఫోటోలు అలాగే ఇప్పుడు బాలి విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుని వారిని ఖుషీ చేస్తోంది. దీంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఇక సమంతకు గతంలో మయోసైటిస్ అనే కండరాల వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఆ వ్యాధి ఇప్పటికీ సమంతను వేధిస్తుందని తెలుస్తోంది. అందుకే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. త్వరలో ఆమెరికా చికిత్స్ కోసం అమెరికా వెళ్లనుందని, పూర్తిగా కోలుకున్నాకే ఆమె మళ్లీ తిరిగి సినిమాల్లోకి వస్తుందనే టాక్ నడుస్తోంది. మరి సమంత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు మెరుస్తుందో వేచి చూడాల్సిందే..

Also Read: ఇలియానా నిండు గర్భం - దగ్గరలో డెలివరీ డేట్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
Actor Ali: అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
Nani Paradise: పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
పుకార్లకు చెక్ పెట్టిన ప్యారడైజ్ టీమ్... గట్టిగా ఇచ్చిపడేసిన నాని & కో
Sandigdham Movie: 'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?
'సందిగ్ధం'లో ఎంత మంది ఆర్టిస్టులున్నారో చూశారా? జబర్దస్త్ నుంచి ఎవరెవరున్నారంటే?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget