Actress Pragathi: పాతికేళ్ల వయసులో ప్రగతి - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత ఫోటో చూశారా?
సోషల్ మీడియాలో హల్ చల్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి.. తాజాగా తన పాత ఫోటోను షేర్ చేసింది. పాతికేళ్ల వయసులో దిగిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Actress Pragathi 25 Years Old Pic: క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రీల్ లైఫ్ లో ఫ్యామిలీ పాత్రలు పోషించే ఆమె రియల్ లైఫ్ లో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పొట్టి దుస్తుల్లో జిమ్‌లో గంటలు గంటలు గడుపుతుంది. కఠినమైన వర్కౌట్స్ చేస్తుంది. గత కొంత కాలంగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న ఆమె.. పవర్ లిఫ్టింగ్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని మెడల్ అందుకుంది.
పాత ఫోటో షేర్ చేసిన నటి ప్రగతి
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి తాజాగా ఓ రేర్ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోను షేర్ చేసింది. “పాతికేళ్ల వయసులో ఎలా ఉన్నానో చూడండి” అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. “సన్నగా, పీలగా ఉన్న అప్పటి ప్రగతి కంటే, బొద్దుగా, ముద్దుగా ఉన్న ఇప్పటి ప్రగతి ఆంటీనే బాగుంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అప్పటి కంటే ఇప్పుడే చూడ్డానికి బాగున్నావంటూ మరికొంత నెటిజన్లు అంటున్నారు.
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభం
నిజానికి ప్రగతి హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తొలుత రెండు, మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నటిగా పిక్ అవుతున్న సమయంలోనే కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది. ‘బాబీ’ సినిమాలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తల్లి, అత్త, అక్క, సహా పలు పాత్రల్లో నటించింది. వందలాది చిత్రల్లో నటించి మెప్పించింది.
కరోనా తర్వాత సోషల్ మీడియాలో హల్ చల్
కరోనా తర్వాత సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారింది ప్రగతి. అప్పటి వరకు సినిమాల్లో ట్రెషనల్ గా కనిపించిన ప్రగతి, ఆ తర్వాత చిట్టిపొట్టి దుస్తుల్లో జిమ్ లో డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రగతి వీడియోలు చూసి మొదట్లో ఓ రేంజిలో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ వయసులో జిమ్ లో ఆ గెంతులు అవసరమా? అంటూ కామెంట్స్ చేశారు. నెటిజన్ల కామెంట్స్ కు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది ప్రగతి. నా ఆరోగ్యం నా ఇష్టం అంటూ ఘాటుగా సమాధానాలు చెప్పింది. గత కొంతకాలంగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న ఆమె, పవర్ లిఫ్టింగ్ మీద ఫోకస్ పెట్టింది.
ఇక ప్రస్తుతం ప్రగతికి 48 ఏళ్లు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె, పిల్లలు అయ్యాక విడిపోయింది. ప్రస్తుతం పిల్లలతో కలిసి జీవిస్తుంది. త్వరలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపించడం విశేషం.
Read Also: మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్- ఆకట్టుకుంటున్న ‘హరోం హర‘ ట్రైలర్