Daksha Nagarkar: తొడలు.. మసాల వడలు - నెటిజన్ కామెంట్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చిన హాట్ బ్యూటీ దక్ష
Daksha Nagarkar: క్యూట్ బ్యూటీ దక్ష నాగర్కర్ తొడల గురించి నెటిజన్ చేసిన కామెంట్, దానికి ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ తొడల వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది.
Daksha Nagarkar About Her Thighs: తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది బోల్డ్ బ్యూటీ దక్ష నాగర్కర్. ‘హుషారు’, ‘జాంబీరెడ్డి’, ‘బంగార్రాజు’, ‘రావణాసుర’ సహా పలు మూవీస్ లో కనిపించింది. అందం, అభినయంతో అలరించింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అందాల విందుతో నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తరచుగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ, వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తుంది. రీసెంట్ గా మరోసారి తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది.
అభిమానులతో దక్ష ఇంటరాక్షన్
తన తాజా ఇన్ స్టా గ్రామ్ ఇంటరాక్షన్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన స్టైల్ లో ఫన్నీ సమాధానాలు చెప్తూ ఆకట్టుకుంది. కొన్నిసార్లు సీరియస్ గా, మరికొన్నిసార్లు ఫన్నీగా, ఇంకొన్నిసార్లు కాంట్రవర్శియల్ గా సమాధానాలు చెప్పింది. తాజా సెషన్ లో నెటిజన్ కామెంట్ కు ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఇంతకీ, నెటిజన్ ఏమన్నాడు? దక్ష నాగర్కర్ అతడికి ఏం సమాధానం చెప్పింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దక్ష తొడల గురించి నెటిజన్ తుంటరి కామెంట్
తన గురించి, తన సినిమాల గురించి దక్ష పలు కీలక విషయాలు వెల్లడించింది దక్ష. ఈ సమయంలోనే ఓ నెటిజన్ ఆమె గురించి ఓ హాట్ కామెంట్ చేశాడు. మీ తొడలు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అంతటితో ఆగకుండా, వాటికి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. అంత అందమైన తొడలు ఎలా వచ్చాయి? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పండి అన్నట్లు కామెంట్ పెట్టాడు. ఈ ప్రశ్నకు ఆమె సీరియస్ అవుతుందని చాలా మంది భావించారు. దిమ్మతిరిగే సమాధానం ఇస్తుందని అనుకున్నారు. కానీ, ఆమె ఏమాత్రం సీరియస్ కాకుండా ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. అతడి స్టైల్ లోనే ఆన్సర్ చెప్పింది.
తొడలు, మసాల వడలు..
తన తొడలు ఎందుకు అంత అందంగా ఉంటాయో వివరించే ప్రయత్నం షార్ట్ గా, స్వీట్ గా, ఫన్నీగా రిప్లై ఇచ్చింది. నా తొడలు ఎందుకు అంత బాగున్నాయి అంటే, నేను మసాలా వడలు తింటాను అని చెప్తూ నవ్వింది. తొడలు, వడలు అంటూ దక్ష ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె చెప్పిన ఫన్నీ ఆన్సర్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దక్షలో భలే హ్యూమరస్ యాంగిల్ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అటు తన తన తర్వాతి ప్రాజక్టుల గురించి అభిమానులు ప్రశ్నలు అడిగారు. అయితే, ఆమె వాటి గురించి పెద్దగా స్పందించలేదు.
Big fan of your Thodalu anta 🤣🤣🤣
— M A N I (@Manirebelism) February 5, 2024
Heroine reply Adhurs 🔥🔥 pic.twitter.com/H8GbTCrkwt
Read Also: ఆమె సినిమాలను తొక్కేయాలని చూస్తుంది - ‘12th ఫెయిల్’ డైరెక్టర్ భార్యపై కంగనా ఫైర్