అన్వేషించండి

Poorna: మా మధ్య ఏదో ఉందన్నారు - దర్శకుడి మాటలకు స్టేజ్‌పైనే ఏడ్చేసిన పూర్ణ

Poorna: "మా ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకారు పుట్టించారు. పూర్ణ నాకు అమ్మ లాంటిది" డైరెక్టర్‌ మాటలకు ఏడ్చేసిన పూర్ణ. అసలు ఏం జరిగిందంటే?

Poorna : హీరోయిన్‌ పూర్ణ. మళయాళి అయినప్పటికీ.. తెలుగమ్మాయిలా చక్కగా ఉంటుంది. చక్కటి హావభావాలు, చీరకట్టుతో తెలుగులో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది పూర్ణ. తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్‌ చేసింది. ఎన్నో రియాల్టీ షోల్లో పాల్గొనింది కూడా. ఇప్పుడు ఆమె నటించిన తమిళ చిత్రం 'డెవిల్‌' ఫిబ్రవరి 2న రిలీజ్‌ కాబోతోంది. ఈసందర్భంగా చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో స్టేజ్‌పైనే ఒక్కసారిగా ఏడ్చేశారు పూర్ణ. సంగీత దర్శకుడు మిష్కిన్‌ చెప్పిన మాటలకు ఆమె ఎమోషనల్‌ అయ్యారు.

పూర్ణ తల్లిలాంటిది.. 

ప్రముఖ డైరెక్టర్‌ సోదరుడు, 'సవరకట్టి' సినిమా ఫేమ్‌ ఆదిత్య దర్శకత్వం చేసిన సినిమా 'డెవిల్‌'. పూర్ణ, విదార్థ్‌, అరుణ్‌, మిష్కిన్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి విశేషాలను పంచుకునేందుకు చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో సంగీత దర్శకుడు మిష్కిన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పూర్ణ అద్భుతంగా నటించిందని కొనియాడారు. అయితే, తమ మధ్య ఏదో ఉందని రూమర్‌ క్రియేట్‌ చేశారని, కానీ.. పూర్ణ తనకు అమ్మలాంటిది అని అన్నారు. వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానని చెప్పి ఎమోషనల్‌ అయ్యారు మిష్కిన్‌. దీంతో మిష్కిన్‌ మాటలు విన్న పూర్ణ కూడా స్టేజ్‌పై ఒక్కసారిగా ఏడ్చేశారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తన తమ్ముడు డైరెక్ట్‌ చేశాడని, అందుకే సపోర్ట్‌ చేస్తున్నానని కొంతమంది మాట్లాడుకోవడం బాధించింది అని అన్నారు. ఇక ఈ సినిమాకి మిష్కిన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  

'డెవిల్‌' ఒక ఎమోషన్‌

ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. 'డెవిల్‌' సినిమా కాదని ఒక ఎమోషన్‌ అని అన్నారు. అది తన జీవితానికి రిలేట్‌ అయిన ఒక ఎమోషనల్‌ అని చెప్పారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ.. దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా ఇష్టం అని అయితే.. అందులో ఉండాల్సిన నిజాయితీని గురువు మిష్కిన్‌ నుంచే నేర్చుకున్నానని చెప్పారు. కాగా.. ఈ సినిమాకి మిష్కిన్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. హెచ్‌ పిక్చర్స్‌ హరి, టచ్‌ స్క్రీన్‌ జ్ఞానశేఖర్‌ కలిసి నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న డెవిల్‌ ఫిబ్రవరి 2న రిలీజ్‌ అవ్వబోతోంది. 

పూర్ణ అసలు పేరు షమ్నా ఖాశీం. ఆమెకు గతేడాది జూన్‌లో దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం జరిగింది. వారికి ఒక మగబిడ్డ కూడా జన్మించాడు. పూర్ణ కొడుకు పేరు హమ్దాన్ అసిఫాలీ. ఇక ఆమెకు పెళ్లైన తర్వాత కూడా యాక్టింగ్‌ చేస్తున్నారు. పూర్ణ ఎంతో డెడికేషన్‌తో వర్క్‌ చేస్తుందని ఆమెను చాలాసార్లు ప్రశంసించారు చాలామంది. నిజానికి ఆమె అంతే ప్యాషన్‌తో వర్క్‌ చేస్తారు కూడా. నాని 'దసరా' సినిమా టైంలో పూర్ణ ప్రెగ్నెంట్‌ అయినా కూడా వర్షంలో రెండు రోజులు తడిచి చేసే సీన్‌ చేసి అందరి మన్ననలు పొందారు ఆమె. ఇక మొదట్లో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా ఇప్పుడు స్పెషల్‌రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ మధ్యే మహేశ్‌బాబు నటించిన 'గుంటూరు కారం'లో కూడా ఆమె ఒక రోల్‌ చేశారు. 

Also Read: పేద, ధనిక విభజనెందుకు? ఆ రూల్స్‌పై తాప్సీ సీరియస్‌

టాప్ హెడ్ లైన్స్

DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget