అన్వేషించండి

Anushka Sharma: అనుష్క ప్రెగ్నెంట్ - రెండో బిడ్డకు విరుష్క దంపతులు రెడీ, కన్ఫర్మ్ చేసిన విరాట్ కోహ్లీ ఫ్రెండ్

Anushka Sharma second Pregnancy: ఇప్పటికే అనుష్క శర్మ మరోసారి ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ ఆ విషయాన్ని తాజాగా విరాట్ కోహ్లీ ఫ్రెండ్ కన్ఫర్మ్ చేశాడు.

Anushka Sharma Second Pregnancy: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... వీరిద్దరూ అటు క్రికెట్ వరల్డ్‌లో మాత్రమే కాదు, ఇటు బాలీవుడ్‌లో కూడా చాలా మంది ఫేవరెట్ కపుల్. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ఇప్పటికే పలుమార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. తను రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన ప్రతీసారి తన ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటిపై అనుష్క ఓసారి సీరియస్ అయ్యింది కూడా. కానీ ఈసారి మాత్రం అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ ఫ్రెండే రివీల్ చేశాడు. తాజాగా ఏబి డెవిలియర్స్... అనుష్క సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఇచ్చిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెస్టులు మిస్ అవుతున్న విరాట్!

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్లినా... ఫోటోగ్రాఫర్లు అక్కడ వాలిపోతారు. అలా తాజాగా బయటికొచ్చిన ఫోటోలలో అనుష్క... బేబీ బంప్‌తో కనిపించింది. కానీ తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఈ కపుల్ ఇష్టపడలేదు. తాజాగా విరాట్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఏబి డెవిలియర్స్ వల్ల ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడడంలో బిజీగా ఉంది ఇండియా. ఇప్పటికే ఈ 5 టెస్ట్ సిరీస్‌లో 2 టెస్టులు పూర్తయ్యాయి. కానీ ఈ రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ కనిపించలేదు. విరాట్ ఎందుకు ఫీల్డ్‌లోకి దిగడం లేదని ఫ్యాన్స్ అంతా ఆందోళనపడ్డారు. దానికి అసలు కారణాన్ని తాజాగా ఒక వీడియోలో ఏబి డెవిలియర్స్ రివీల్ చేశాడు.

కన్ఫర్మ్ చేయలేను..

ఏబి డెవిలియర్స్ తాజాగా ఒక యూట్యూబ్‌ షోలో పాల్గొన్నాడు. అందులో విరాట్ కోహ్లీ... టెస్టులకు రాకపోవడానికి సంబంధించిన ప్రశ్నలు తనకు ఎదురయ్యాయి. ‘‘నాకు తెలిసి తను బాగానే ఉన్నాడు. తను కుటుంబంతో కాస్త సమయాన్ని గడుపుతున్నాడు. అందుకే ముందు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు రాలేదు. నేను ఇప్పుడే ఏది కన్ఫర్మ్ చేయాలని అనుకోవడం లేదు. తను వెంటనే తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపాడు ఏబి డెవిలియర్స్. అంతే కాకుండా విరాట్ కోహ్లీతో జరిగిన సంభాషణ గురించి కూడా బయటపెట్టాడు. ఎలా ఉన్నావని మెసేజ్ పెట్టగా... తన కుటుంబంతో ఉండడం అవసరమని, తాను బాగానే ఉన్నానని విరాట్ కోహ్లీ రిప్లై కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు ఏబి డెవిలియర్స్.

సరైన నిర్ణయం తీసుకున్నాడు..

‘‘అవును తనకు రెండో బిడ్డ పుట్టబోతున్నారు. ఇది ఫ్యామిలీ టైమ్. ఇదంతా తనకు చాలా ముఖ్యం. చాలామంది మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను. విరాట్‌ను ఈ విషయంలో జడ్జ్ చేయలేము. మేము తనను చాలా మిస్ అవుతున్నాం. కానీ తనకు కచ్చితంగా సరైన నిర్ణయమే తీసుకున్నాడు’’ అంటూ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల రెండో బిడ్డ గురించి బయటపెట్టాడు ఏబి డెవిలియర్స్. విరాట్, అనుష్క.. 2017లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఇప్పటికే వామికా అనే పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయిన అనుష్క.. ప్రస్తుతం ‘చక్దే ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Also Read: బాలీవుడ్ సీనియర్ హీరోను లైన్‌లో పెట్టిన సందీప్ - డార్క్ యాక్షన్ క్రైమ్ థిల్లర్ కథతో సినిమా

టాప్ హెడ్ లైన్స్

Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget