అన్వేషించండి

800 OTT Release Date : ఓటీటీలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ - రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.

800 Movie Muttiah Muralitharan Biopic OTT Release : లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారం రూపొందిన సినిమా '800'. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది.

జియో ఓటీటీలో '800'... విడుదల ఎప్పుడంటే?
800 movie digital streaming platform : అక్టోబర్ 6న '800' థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. '800' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'జియో సినిమా' ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు కానుందని ఈ రోజు ట్వీట్ చేసింది. 

800 digital release date : తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ సింహళ భాషల్లో '800' డిజిటల్ రిలీజ్ కానుంది. థియేటర్లలో సినిమా విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే... ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదు. ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. ఆ కారణంగా జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.   

Also Read : సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?

'800' సినిమాలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌ డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ (Madhur Mittal), మురళీధరన్ భార్య మది మలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. 'అఖండ', 'స్కంద' సినిమాల ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్ర చేశారు. 

Also Read  : టాలీవుడ్‌లో మరో విషాదం - చంద్ర మోహన్ మరణించిన రోజే 'రొమాంటిక్ క్రైమ్ కథ', 'రొమాంటిక్ క్రిమినల్స్' నిర్మాత రవీంద్ర బాబు మృతి

'800'లో క్రికెట్ మాత్రమే కాకుండా... అంతకు మించి తన వ్యక్తిగత విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందు ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు, క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎదురైన అవమానాలు వంటివి చూపించారు. చెన్నైకు చెందిన అమ్మాయిని మురళీధరన్ వివాహం చేసుకున్నారు. ఆయనతో వివాహం తర్వాత ఆమెకు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నను కూడా సినిమాలో ఉంచారు. తొలుత విజయ్ సేతుపతి హీరోగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేయాలని సన్నాహాలు చేశారు. అయితే... తమిళనాడులో కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన తప్పుకొన్నారు. అప్పుడు మధుర్ మిట్టల్ వచ్చారు. తొలుత సినిమా నిర్మించాలనుకున్న వ్యక్తులు కూడా తప్పుకోవడంతో మరొకరు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి శ్రీదేవి మూవీస్ అధినేత సినిమా కొని విడుదల చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget