Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 30th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీతో పాటు ఆఫీస్‌కి వెళ్లిన మిత్ర.. సెటైర్లు వేస్తు సైలెంగ్‌గా భలే కామెడీ చేస్తున్నాడుగా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీతో పాటు మిత్ర కూడా ఆఫీస్‌కి వెళ్లడం అక్కడ లక్ష్మీతో సెటైర్లు వేయడం చాలా కామెడీగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఆఫీస్‌కి రెడీ అవుతుంటే మనీషా చూసి వచ్చి ఎక్కడికి అని ప్రశ్నిస్తుంది. ఆఫీస్‌కి అని మిత్ర చెప్తే ఛైర్మన్ పదవి నుంచి తొలగించేస్తే ఇంకెందుకు ఆఫీస్‌కి అని ప్రశ్నిస్తుంది. దానికి మిత్ర నేను ఛైర్మన్ కాకపోయినా కంపెనీ నాది నేను పక్కన లేకపోతే లక్ష్మీ అల్లకల్లోలం చేసేస్తుందని నేను లేకుండా తను ఏం చేయలేదు అని ఛైర్మన్ తను అయినా తనని నేను కమాండ్ చేయాలి అని మిత్ర అంటాడు. మనీషా తాను కూడా ఆఫీస్‌కు వస్తానని అంటుంది. దాంతో మిత్ర సరే అంటాడు. ఇక లక్ష్మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరూ కంపెనీ విలువ పెరగాలని అంటారు. ఇక మిత్ర మనీషా కలిసి వస్తారు. జయదేవ్ కావాలనే ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు.
మిత్ర: ఆఫీస్‌కి
అరవింద: ఏం ఆఫీస్‌కి మిత్ర ఏదైనా జాబ్‌లో జాయిన్ అయ్యావా.
మిత్ర: అంత వెటకారం ఎందుకమ్మా మనీ ఆఫీస్‌కి వెళ్తున్నా. అర్హత లేని వాళ్లని మీరు కంపెనీ ఛైర్మన్ స్థానంలో కూర్చొపెడితే నేను ఊరుకుంటానా.
అరవింద: ఆఫీస్‌కి వెళ్లి ఏం చేస్తావ్ మిత్ర లక్ష్మీ కింద పని చేస్తావా
మిత్ర: లక్ష్మీతో పని చేయిస్తా.
జయదేవ్: ఛైర్మన్‌తోనే పని చేయిస్తావా అక్కడ నువ్వు తన ఆర్డర్స్ పాటిస్తావా.
మిత్ర: నేను తనతో పని చేయిస్తా.
అరవింద: నువ్వు ఎక్కడికి మనీషా.
జయదేవ్: అక్కడ వాడికే పని లేదు నువ్వు ఎందుకమ్మా.
మిత్ర: డాడ్ ఇది టూ మచ్. పని అంటే ఎంటో తెలీని దానికి అందలం ఎక్కించి నన్ను పక్కన పెట్టారు నేను ఏంటో చూపిస్తా. లక్ష్మీ వచ్చి నన్ను బతిమాలింది కాబట్టి వెళ్తున్నా.
మిత్ర వాళ్లు ఆఫీస్‌కు వెళ్తుంటే జాను ఆపి వివేక్ చేతిలో చేయి వేసుకొని తీసుకొని వచ్చి ఎప్పుడూ మీ అమ్మ కొంగు పట్టుకొని కాకుండా మా అక్క బావల దగ్గర పని నేర్చుకో అంటుంది. ఇక లక్ష్మీతో అక్క ఈ రోజు నా భర్తని నీ చేతిలో పెడుతున్నా బాగా చానబెట్టి బావగారిలా రెడీ చేయ్ అని అంటుంది. ఇక లక్ష్మీ వాళ్లు ఆఫీస్‌కి వెళ్తారు. మనీషా మిత్ర పక్కన కూర్చొంటానంటే లక్ష్మీ ఆపి కంపెనీ ఛైర్మన్‌గా నేనే ముందు ఉండాలి అని అంటుంది. ఇక జాను అత్తయ్య రండి టిఫెన్ చేయండి అంటుంది. దానికి దేవయాని నేను రాను అంటే నేను మిమల్ని పిలవలేదు అరవింద అత్తయ్యని పిలిచాను అంటుంది. దానికి చిన్నత్తయ్య పెద్ద అత్తయ్య అని పిలవమని అంటుంది. ఇక దేవయాని నడుము పట్టేస్తుంది. దాంతో దేవయాని ఏం జరిగిందో చెప్పకుండా కవర్ చేస్తే తర్వాత జాను జరిగింది అంతా చెప్తుంది. ఆవిడ మారే వరకు ఇలాగే చేస్తాను అంటుంది జాను.
మిత్ర ఆఫీస్‌కి వెళ్తాడు. అందరూ ఛైర్మన్‌గా లక్ష్మీకి బొకేలు ఇచ్చి గౌరవిస్తే తనకు ఇబ్బందిగా ఉందని వెళ్లకుండా ఉండాలని అనుకుంటాడు. కానీ లక్ష్మీ, వివేక్‌లు మిత్రని రమ్మని పిలుస్తారు. వస్తే నాకు రెస్పెక్ట్ పోతుందని మిత్ర మనసులో అనుకుంటాడు. ఎంతకీ లక్ష్మీ వదలకపోతే ఇలా తగులుకుందేంటి అని మిత్ర అనుకుంటారు. ఇక అందరూ లోపలికి వెళ్తారు. అందరూ మిత్రని విష్ చేసి మిత్రని పొగుడుతారు. దాంతో మిత్ర ఛైర్మన్ నువ్వు అయితే నాకు రెస్పెక్ట్ ఇచ్చారు అది నా పవర్ అంటాడు. ఇక్కడ నేనే హీరో అని మిత్ర అంటే వివేక్ దానికి ఆ క్రెడిట్ ఇచ్చింది వదినే వదిన ఛైర్మన్ అయినట్లు స్టాఫ్‌కి ముందే తెలుసు అని ఆఫీస్‌లో ఎవరూ తనకు విష్ చేయకూడదు అని నీ గౌరవం ఎక్కడా తగ్గించకూడదు అని వదిన ఇలా చేసింది అంటాడు.
మిత్ర దగ్గర లక్ష్మీ మార్కులు కొట్టేసిందని అనుకుంటుంది. ఇక మిత్ర ఛైర్మన్ కుర్చీలో కూర్చొంటే వివేక్ వచ్చి అన్నయ్యా అంటే మిత్ర లక్ష్మీని గదిలో నుంచి వెళ్లిపోమని అంటాడు. దానికి వివేక్ అన్నయ్య నువ్వే వెళ్లాలి అన్నయ్య ఇది వదిన చాంబర్ అంటే అదే ఛైర్మన్ ప్లేస్ అంటాడు. లక్ష్మీ పర్లేదు అంటే మిత్ర నువ్వు అడ్జస్ట్ అయినా వీడు అవ్వడు మా అమ్మానాన్నలకు చెప్పి పంచాయితీ పెట్టిస్తాడు. పద మనీషా ఆ మూల ఓ బల్ల వేసుకొని కూర్చొందాం. ఇక లక్ష్మీ మిత్ర ఆశీర్వాదం అడిగితే ఎందుకు నా ఛైర్ లాగేశావు ఇప్పుడు కాళ్లు కూడా లాగేస్తావా అంటాడు. ఇక లక్ష్మీకి ఆశీర్వాదం ఇచ్చి వారంలో నీ ఛైర్మన్ స్థానం లాగేసుకుంటా అప్పటి వరకు దాన్ని తుడిచి జాగ్రత్తగా ఉంచు అంటాడు. ఇక లక్ష్మీకి వివేక్ సపోర్ట్ చేస్తే తన ఫ్యాన్ నువ్వు ఒక్కడివే ఇంకా ఉన్నారా అని అంటాడు. ఇక లక్ష్మీ ఛైర్మన్ కుర్చీలో కూర్చొంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.