Chalo Chalo Song: రానా పవర్ ఫుల్ వాయిస్ - పాటకే హైలైట్
తాజాగా 'విరాటపర్వం' సినిమా నుంచి 'చలో చలో' అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను రానా పాడారు.
దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ముందుగా జూలై 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కాస్త ముందుగా జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ముందుగా ఈ సినిమా నుంచి 'నగాదారిలో' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది. సాయిపల్లవి, రానాల పెర్ఫార్మన్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'చలో చలో' అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను రానా పాడారు.
తన పవర్ ఫుల్ వాయిస్ తో పాటకు ప్రాణం పోశారు. జిలుకారా శ్రీనివాస్ లిరిక్స్ అందించారు. లిరిక్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. సొసైటీ ఉన్న సమస్యలను, మహిళలపై జరిగే అరాచకాలను ఎదుర్కోవాలని చెప్పే పాటే ఇది. ఈ ఒక్క పాట 'విరాటపర్వం' సినిమా ఎంత సీరియస్ గా ఉండబోతుందో చెప్పేసింది. విజువల్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Also Read: ఆరోజు 'పంజా' ఈరోజు 'మేజర్' - పవన్ మాటలకు అడివి శేష్ రిప్లై
Also Read: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్
View this post on Instagram