By: ABP Desam | Updated at : 29 Jul 2021 11:44 AM (IST)
Gehana Vasisth
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతింది. తాజాగా ముంబైకి చెందిన ఓ నటి హాట్ షాట్స్ కోసం తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో నటి గహనా వశిష్ట్ తో పాటు రాజ్ కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ కుంద్రా హాట్ షాట్స్ వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారని ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గహనా వశిష్ట్ తో పాటు పది మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఎన్నో నిజాలు తెలిశాయి. దీంతో రాజ్ కుంద్రాను జూలై 19న అరెస్ట్ చేశారు. అతడు హాట్ షాట్స్ యాప్ లో పోర్న్ వీడియోలు అప్లోడ్ చేశేవాడని తెలిసింది.
ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు ఒక్క హాట్ షాట్స్ యాప్ ద్వారానే అతడు 1.17 కోట్లు సంపాదించాడని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ఆదాయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం రాబట్టడానికి యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుండి పూర్తి వివరాలను కోరామని ముంబై పోలీసులు వెల్లడించారు. కాగా.. రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు కొట్టివేసింది. నిందితుడికి 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ విషయంపై తాము హైకోర్టుని ఆశ్రయిస్తామని నిందితుడి తరఫు న్యాయవాది పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే రాజ్ కుంద్రా ఆఫీస్ మీద పోలీసులు రైడ్ చేసినప్పుడు రహస్య కప్‌బోర్డులను గుర్తించారు. వీటిలో ఆర్ధిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. కానీ రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసేనాటికే అక్కడ చాలా సమాచారాన్ని డిలీట్ చేశారని అధికారులు పేర్కొన్నారు. తాజాగా మరోసారి రాజ్ కుంద్రాకు షాక్ తగిలింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, వారి సంస్థలపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈ ఆర్డర్ అందిన 45 రోజులలోపు మూడు లక్షలు చెల్లించాలని ఆదేశించింది. శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాకు చెందిన సంస్థ వయాన్ ఇండస్ట్రీస్‌పై సెబీ 3 లక్షల జరిమానా విధించింది. సెబీ (ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించినట్లు తెలుస్తోంది.
Also Read : Rajkundra case : రాజ్‌కుంద్రా కేసులో మరో మలుపు... నటి షెర్లీ చోప్రాకు నోటీసులు
Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!
Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి
/body>