Rashmika: ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్, రష్మిక ఓకే చెబుతుందా?

రీసెంట్ గా విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ దక్కింది.

FOLLOW US: 

'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం చాలా ఏళ్లపాటు తన డేట్స్ కేటాయించిన ఎన్టీఆర్ మధ్యలో ఒక్క సినిమా కూడా చేయలేదు. రీసెంట్ గా విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ దక్కింది. దీంతో ఈ ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్స్ ను పూర్తి చేస్తున్నారు. 

మరోపక్క ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారు. దీక్ష పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ ను తీసుకోవాలనుకున్నారు. అలియా కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించింది. కానీ ఇప్పుడామె హాలీవుడ్ సినిమా ఒప్పుకోవడంతో ఎన్టీఆర్ సినిమాకి డేట్స్ ఎప్పుడు ఇస్తుందో చెప్పలేని పరిస్థితి. 

పైగా కొరటాల రాసుకున్న కథ ప్రకారం.. హీరోయిన్ రోల్ కోసం ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి ఉంటుందట. అన్ని రోజులు అలియాభట్ డేట్స్ ఇవ్వగలదో లేదో కూడా తెలియదు. అందుకే బల్క డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రష్మికను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆమె కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. 'పుష్ప2' సినిమాతో పాటు కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కూడా ఒప్పుకుంది. మరి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుంటుందో లేదో చూడాలి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించనున్నారు. 

Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yuvasudha Arts (@yuvasudhaarts)

Published at : 22 Apr 2022 03:22 PM (IST) Tags: ntr alia bhatt Rashmika Koratala siva

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!