అన్వేషించండి

Brahmamudi June 26th: రాహుల్ చెంప పగలగొట్టిన రుద్రాణి- పెళ్ళాం కొంగు చాటున దాక్కున్న రాజ్, నవ్వులే నవ్వులు

స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రాహుల్ కనీసం తనని మనిషిగా కూడా గుర్తించడం లేదని స్వప్న పెద్దవాళ్ళ ముందు తన గోడు వెళ్లబోసుకుంటుంది. ఇది క్షమించరాని నేరమని ఇంద్రాదేవి అంటుంది. అందరూ కలిసి రుద్రాణిని టార్గెట్ చేసి తిడతారు. ఇది ఆడవాళ్ళు మాత్రమే చర్చించి పరిష్కరించాల్సిన సమస్య, అత్తగా కోడలి మీద పెత్తనం చేస్తావ్ కానీ కొడుకుని మందలించలేవా. గతంలో నా కొడుకు విషయంలో నీతులు చెప్పావు కదా ఇప్పుడు నా వంతు వచ్చిందని అపర్ణ వేసుకుంటుంది. అప్పుడే రాహుల్ ఇంటికి వస్తాడు. ఈ రాక్షసి ఏదో మంట పెట్టినట్టు ఉందని తిట్టుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఎక్కడికి వెళ్లావని రాజ్ రాహుల్ ని నిలదీస్తాడు. ఇవాళ లేట్ అయ్యిందని చెప్పేసరికి ఈరోజు మాత్రమే లేట్ అయ్యిందా అని కోపంగా అంటాడు.

పెళ్ళాం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తావా? నువ్వే కావాలని బలవంతంగా పెళ్లి చేసుకున్నానని అలుసైపోయానా అని స్వప్న కోపంగా అడుగుతుంది. ఈ పద్ధతి సరైంది కాదని భార్యని పట్టించుకోవాలని సీతారామయ్య అంటాడు.

Also Read: క్షేమంగా ఇంటికొచ్చిన ఖుషి- నీలాంబరి వార్నింగ్ కి వణికిపోయిన అభి, ఖైలాష్

రాహుల్: చాలా ఇప్పుడు అందరి ముందు నన్ను వెధవని చేశావు. అసలు నీకు బుద్ధి ఉందా అని అనగానే రుద్రాణి కోపంగా కొడుకు చెంప పగలగొడుతుంది.

రుద్రాణి: అందరి ముందు నాకు తలవంపులు తీసుకొచ్చావు. బెడ్ రూమ్ విషయాలు బయట పెట్టింది. ఇంకొక్క సారి ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు వస్తే ఇద్దరినీ బయటకి పంపించేస్తాను. ఇంకోసారి నా కొడుకు వల్ల ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను నాన్న క్షమించండి

కావ్య లేట్ గా నిద్రలేస్తుంది. ధాన్యలక్ష్మి కావ్యని పిలిస్తూ రావడం విని హడావుడిగా పరుపు దాచేస్తుంది. అది చూసి ఎందుకు ఇలా చేస్తున్నావని రాజ్ అడుగుతాడు. అప్పుడే పిన్ని పిలుపు విని వామ్మో ఇప్పుడు పరుపు చూసిందంటే లేని కష్టాలు కూడా ఉన్నాయని పడుకుని మరీ చూపిస్తుందని టెన్షన్ పడతాడు. పరుపు కబోర్డులో తోయడానికి ట్రై చేస్తుంటే సరిగ్గా అప్పుడే ధాన్యలక్ష్మి గదిలోకి వచ్చేస్తుంది. దీంతో రాజ్ పెళ్ళాం కొంగు చాటున మొహం పెట్టేసుకుంటాడు. ఆ సీన్ కామెడీగా ఉంటుంది. కనకం ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్ళని చూసి మీనాక్షి వణికిపోతుంది. వడ్డీ వ్యాపారి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు చెప్తారు. సేటు మూటలో నుంచి పాకుతూ బయటకి రావడానికి ట్రై చేస్తాడు.

Also Read: సంతోషంగా గడుపుతున్న కృష్ణ,మురారీ- బ్లాక్ మెయిల్ ఆటకి దిగిన ముకుంద

సరిగ్గా అప్పుడే సేటు ఉన్న మూట దొర్లుకుంటూ హాల్లోకి వస్తుంది. అది చూసి కనకం వాడిని తన్నేస్తుంది. వాళ్ళని డైవర్ట్ చేయడానికి మీనాక్షి తిక్కతిక్కగా ఏదేదో వాగుతూ బుర్రలు తినేస్తుంది. రాహుల్ కోపంగా ఉంటే రుద్రాణి వస్తుంది. ఎందుకు వచ్చావ్ మళ్ళీ కొట్టడానికా అని తిడతాడు. ఒకవైపు రాజ్, ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ చేస్తుంటే నువ్వు కూడా నన్ను కొట్టావని బాధపడతాడు. నువ్వు టైమ్ కి ఇంటికి వచ్చి ఆ స్వప్నతో మంచిగా ఉంటే బాగుండేది కదా అని అంటుంది. అది తన వల్ల కాదని తనతో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్తాడు. స్వప్న నీకు నచ్చకపోయినా సరే తనని భరించకతప్పదని చెప్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Chennai Love Story Collections : చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
Secret Of kalinga OTT : బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్
బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget