అన్వేషించండి

Brahmamudi July 4th: కావ్య వేసిన డిజైన్స్ చింపేసిన రాజ్- అప్పు మీద మర్డర్ కేసు

స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తన కుటుంబం గురించి నీచంగా మాట్లాడినందుకు అప్పు కోపంగా రాకేష్ తల పగలగొడుతుంది. వెంటనే తన ఫ్రెండ్స్ అప్పుని ఇంటికి పంపించేస్తారు. ఇంట్లో అప్పు టెన్షన్ గా ఉంటే కనకం వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏమి లేదని చెప్పి తన మీద చిరాకు పడుతుంది. రాజ్, కావ్య కలిసి ఆఫీసుకి వస్తారు. శృతి వచ్చి డిజైన్స్ తీసుకొచ్చి రాజ్ కి చూపిస్తే అవి ఏ మాత్రం నచ్చవు. తనకి మళ్ళీ కాస్త టైమ్ ఇవ్వమని ఆ అమ్మాయి బతిమలాడుతుంది. డిజైన్స్ మళ్ళీ చేస్తానని వెళ్ళిపోతుంది. కావ్య రాజ్ ని గమనిస్తూ ఉంటుంది. ఆఫీసులో పని చేసే అమ్మాయిలు వచ్చి కావ్యని పలకరించి మీ డిజైన్స్ బాగున్నాయని మెచ్చుకుంటారు. రమేష్ కూడా వచ్చి మీ డిజైన్స్ సూపర్ గా ఉన్నాయని మెచ్చుకుంటాడు.

Also Read: రేవతి ఆన్ ఫైర్- డైరీ అమ్మాయి ముకుందేనని కృష్ణ కనిపెట్టేస్తుందా?

కృష్ణమూర్తి ఇంటికి పోలీసులు వచ్చి అప్పు గురించి అడుగుతారు. మీ అమ్మాయి ఒకడి తల పగలగొట్టింది వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్తాడు. కృష్ణమూర్తి కంగారుగా అప్పుని పిలుస్తాడు. వాడు అక్కల గురించి వల్గర్ గా మాట్లాడాడు అందుకే కోపం ఆపుకోలేక కొట్టానని చెప్తుంది. ఆడపిల్లని అరెస్ట్ చేయవద్దని కృష్ణమూర్తి బతిమలాడతాడు. కానీ పోలీసులు మాత్రం తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు. క్లయింట్స్ ని మేనేజ్ చేస్తూ రాజ్ ఉంటాడు. క్లయింట్స్ బయటకి వెళ్లొస్తామని చెప్పి వెళ్లిపోతారు. రాజ్ కోపంగా శృతి దగ్గరకి వచ్చి రెండు గంటలు మాత్రమే టైమ్ ఉందని ఈలోపు డిజైన్స్ అవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. క్యాబిన్ లోకి వెళ్ళి చిరాకుగా ఉంటాడు. ఆఫీసులో మీరు ఇంత కష్టపడతారని నాకు తెలియదు. ఇక నుంచి మీరు ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని విసిగించనని కావ్య చెప్తుంది. వాళ్ళు వచ్చే లోపు డిజైన్స్ కంప్లీట్ కాకపోతే ఏమౌతుందోనని టెన్షన్ పడతాడు.

ALso Read: రాకేష్ తలపగలగొట్టిన అప్పు- రాజ్ కి ఆఫీసు వర్క్ లో సాయం చేసిన కావ్య

కావ్య శృతి దగ్గరకి వచ్చి ఎంత వరకు వచ్చిందని అంటుంది. ఎంత ట్రై చేసినా సర్ అడిగినట్టు రాలేదని చెప్తుంది. దీంతో కావ్య డిజైన్స్ వేస్తుంది. కనకం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చి అప్పుని విడిచిపెట్టమని పోలీసుల కాళ్ళ మీద పడుతుంది. కానీ అప్పు మాత్రం తప్పు చేశానని ఒప్పుకుంటుంది. అప్పు మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశామని, నేరం రుజువైతే 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని కానిస్టేబుల్ చెప్పేసరికి కృష్ణమూర్తి వాళ్ళు భయపడిపోతారు. కూతుర్ని పోలీస్ స్టేషన్ లో చూసి కనకం ఏడుస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ ఇప్పుడు నిన్ను ఎలా కాపాడుకోవాలని అంటుంది. తను తప్పు చేశానని శిక్ష అనుభవించక తప్పదని అప్పు చెప్తుంది. ఇక కావ్య డిజైన్స్ వేసి శృతిని తీసుకుని వెళ్ళమని చెప్తుంది. కానీ తను అలా చేయలేనని మీరే వెళ్ళి ఇవ్వమని అంటుంది. అటు క్లయింట్స్ ఫోన్ చేసి ఆఫీసుకి వస్తున్నామని చెప్తారు. కావ్య భయంగా వచ్చి డిజైన్స్ నేను రెడీ చేశాను ఒకసారి చూడమని అంటే రాజ్ కోపంగా వాటిని చూడకుండానే చింపేస్తాడు. ఇదేమైనా ముగ్గుల పోటీనా అనేసి కావ్య మీద సీరియస్ అవుతాడు. చింపేసినందుకు కావ్య చాలా బాధపడుతుంది. ల్యాప్ టాప్ లో ఉన్నాయని వెళ్ళి చూపించమని శృతికి చెప్తుంది. వాటిని రాజ్ కి చూపించగానే చాలా బాగున్నాయని అంటాడు. క్లయింట్స్ కి రాజ్ డిజైన్స్ చూపిస్తాడు. అవి చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Embed widget