News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi February 10th: స్వప్నకి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన రాహుల్- రాజ్ జీవితం నాశనం చేసేందుకు రుద్రాణి కుట్ర

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ప్లాన్స్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

స్వప్న ఇంటికి వచ్చి రాజ్ తల్లిదండ్రులు సంబంధం మాట్లాడటానికి మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్తుంది. కనకం భర్త కృష్ణమూర్తిని వెంటనే కోటీశ్వరుల్లాగా రెడీ అవ్వమని అడుగుతుంది కానీ అందుకు ఆయన మాత్రం ససేమిరా అంటాడు. అటు రుద్రాణి రాజ్ ఇష్టపడిన అమ్మాయి స్వప్న గురించి ఇంట్లో చెప్తుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితి చూసిన తరువాతే పెళ్లి గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని రాజ్ తల్లి అపర్ణ అంటుంది. దీంతో రుద్రాణి సీన్ క్రియేట్ చేసి రాసిన స్వప్ననే పెళ్లి చేసుకోమని రాజ్ కి చెప్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే ..

Also Read: మాజీ భార్య తులసికి చీర బహుమతిగా ఇచ్చిన నందు- రగిలిపోతున్న తాజా పెళ్ళాం

స్వప్న నిన్ను కలవబోతుంది కదా ఏం గిఫ్ట్ ఇస్తున్నవాని పిన్ని ధాన్యలక్ష్మి రాజ్ ని అడుగుతుంది. తన కోసం డైమండ్ రింగ్ తీసుకున్నానని చూపిస్తాడు. కానీ రాహుల్ మాత్రం ఆ రింగ్ తీసుకుని ఇటువంటి గిఫ్ట్ లకు మురిసిపోయే మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు కదా తను నీ మనసు తెలుసుకోవడానికి వస్తుంది, ఏది ఇస్తే ఆ అమ్మాయి ఇంప్రెస్ అవుతుందో అది ఆలోచించమని సలహా ఇస్తాడు. కానీ మనసులో మాత్రం ఈ డైమండ్ రింగ్ ఇచ్చి స్వప్నని ఫ్లర్ట్ చేయాలని రాహుల్ స్కెచ్ వేస్తాడు. అనుకున్నట్టుగానే స్వప్నని రాహుల్ ముందు కలిసి ఆ రింగ్ ఇస్తాడు. అప్పుడే బొకే తీసుకుని రాజ్ రెస్టారెంట్ లోకి వస్తూ ఉంటాడు. స్వప్న డైమండ్ రింగ్ చూసి చాలా సంతోషపడుతుంది .

గురువారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ..

‘నేను ప్రేమించిన అతను కుటుంబం సరిగా లేదని నేను ఇష్టపడిన వ్యక్తిని దూరం చేసి నాకు ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేయించావు. నా జీవితం నాశనం అవ్వడానికి అపర్ణ వదిన కారణం’ అని రుద్రాణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజ్ నా జీవితాన్ని మీ అమ్మ నాశనం చేసింది కానీ నువ్వు మాత్రం నీకు నచ్చిన అమ్మాయి స్వప్ననే పెళ్లి చేసుకో అని ఏడుస్తూ పైకి వెళ్తుంది కానీ మనసులో మాత్రం వీళ్ళందరూ గోతిలో పడబోతున్నారని సంబరపడుతుంది. రాజ్ విషయం చెప్పడం కోసం స్వప్నకి కాల్ చేస్తాడు. కావ్య ఆ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉంది అని అనుకుంటూ ఉండగా స్వప్న రాజ్ ఫోన్ చేశాడేమో అనుకోని పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ తీసుకుంటుంది. స్వప్న మాట్లాడే టైంకి రాహుల్ వచ్చి రాజ్ దగ్గర ఫోన్ లాక్కుంటాడు. రేపు మీరిద్దరూ కలిసి డేట్ కి వెళ్లాలని దానికి బిల్లు కూడా నువ్వే చెల్లించాలని రాహుల్ స్వప్నతో చెప్తాడు. రాహుల్ మాటలు విని చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడు కానీ రాజ్ ఇలా మాట్లాడడని అనుకుంటుంది. ఇక డేట్ కి వెళ్ళడం కోసం డబ్బులు కావాలని వచ్చి కావ్య దగ్గర బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది.

Also Read: మాళవిక ముందు అడ్డంగా బుక్కైన అభిమన్యు- వేద, యష్ జీవితం ఇబ్బందుల్లో పడబోతుందా?

Published at : 10 Feb 2023 09:37 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial February 10th Episode

ఇవి కూడా చూడండి

Archana Gautam: కాంగ్రెస్ ఆఫీస్ ముందు దాడి, నడి రోడ్డుపై అత్యాచారం అంటూ బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Archana Gautam: కాంగ్రెస్ ఆఫీస్ ముందు దాడి, నడి రోడ్డుపై అత్యాచారం అంటూ బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?