అన్వేషించండి

Bomma Blockbuster Trailer : జయమాలిని, జ్యోతిలక్ష్మి పాటలున్నాయని సినిమాలు ఆడలేదు - 'బొమ్మ బ్లాక్ బస్టర్' ట్రైలర్

Nandu Rashmi Gautam's Bomma Blockbuster Trailer : నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ట్రైలర్ విడుదలైంది.

నందు ఆనంద్ కృష్ణ‌ (Nandu Anand Krishna ) కథానాయకుడిగా నటించిన సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' (Bomma Blockbuster Telugu Movie). ఇందులో ఆయనకు జోడీగా ర‌ష్మీ గౌత‌మ్ (Rashmi Gautam) నటించారు. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప‌వ్రీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మ‌డ్డి, మ‌నోహార్ రెడ్డి ఈడా నిర్మించారు. నవంబర్) 4వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
 
నాటకాల నుంచి సినిమాలకు...
'బొమ్మ బ్లాక్ బస్టర్' ట్రైలర్ ఓపెన్ చేస్తే... ఓ గ్యాంగ్ నాటకం రిహార్సల్స్ చేస్తుంటారు. అందులో హీరో నందు ఒకరు. ఆ తర్వాత 'ఏది ఏమైనా భుజంగం గారు... జయమాలిని, జ్యోతిలక్ష్మి పాటలున్నాయని సినిమాలు ఆడేయలేదు, కథ! ఒక హీరోని స్టార్ హీరో చేయాలంటే... మంచి కథ కావాలి. మన రోజులైనా, ఈ రోజులైనా... కథే కావాలండీ బాబు' అని వాయిస్ ఓవర్. కథ రాయడంలో తండ్రిని సలహా అడుగుతున్న తనయుడు. నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన కథలో హీరో పాత్ర ఏమిటన్నది ఆసక్తికరం. 

హీరో నందు క్యారెక్టర్ విషయానికి వస్తే... గొడవలు చూడటం ఇష్టమని అమ్మాయి చెప్పగానే, ఆమెను రౌడీల మధ్యలో తీసుకు వెళ్లిన యువకుడిగా కనిపించారు. హీరోయిన్ రోల్ రష్మీ గౌతమ్ చేశారు. ట్రైలర్ చివర్లో హీరోయిజం ఎలివేట్ అయ్యేలా నందుతో డైలాగులు చెప్పించారు. నాటకం కోసం ధరించిన దుస్తులు, సముద్రం, గొడవ... ఆసక్తిగా ఉంది. నందు, రష్మీ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఇఫీలో 'ఆర్ఆర్ఆర్', 'అఖండ' - భారతీయ సినిమాపై ఇది టాలీవుడ్ ముద్ర

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాకు రాజ్ విరాఠ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా అని ఆయన పేర్కొన్నారు. ఇంకా రాజ్ విరాఠ్ మాట్లాడుతూ ''బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్‌కి త‌గ్గ‌ట్లుగా సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ప‌క్క‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని మా చిత్ర బృందం అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. నా కథపై నమ్మకంతో, నా మీద భరోసాతో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన విజ‌యీభ‌వ సంస్థ వారికి, చిత్ర నిర్మాత‌లు ప్ర‌వీణ్ ప‌గ‌డాల‌, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి మ‌డ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి ఈడా గారికి స్పెషల్ థాంక్స్'' అని తెలిపారు. నందు ఆనంద్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం  : ప్ర‌శాంత్ ఆర్ విహారి, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ్, కూర్పు : బి సుభాస్క‌ర్. 

'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా మీద నందు ఆనంద్ కృష్ణ చాలా ఆశలు పెట్టుకున్నారు. 'పెళ్లి చూపులు'లో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. అంతకు ముందు '100 పర్సెంట్ లవ్', 'పాఠశాల', 'ఆటో నగర్ సూర్య' సినిమాల్లోనూ, ఆ తర్వాత 'సమ్మోహనం' తదితర సినిమాల్లోనూ ఆయన పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే... ఇప్పుడు సోలో హీరోగా నిలబడటం కోసం నందు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'సవారీ' సినిమాలో పాటలు హిట్ కావడంతో ఆ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ప్రేక్షకులు థియేటర్లకు అయితే వచ్చారు గానీ... నందు ఆశించిన విజయం లభించలేదు. అతడు కోరుకున్న విజయాన్ని 'బొమ్మ బ్లాక్ బస్టర్' ఇవ్వాలని ఆశిద్దాం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Embed widget