అన్వేషించండి

Dasara Combo: బ్లాక్ బస్టర్ ‘దసరా‘ కాంబోలో మరో సినిమా, హీరోయిన్‌గా కీర్తిని రిపీట్ చేస్తారా?

‘దసరా‘ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, అదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా మరో సినిమా రూపొందబోతోంది. హీరోయిన్ గా కీర్తిని కంటిన్యూ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘మహానటి‘ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘దసరా‘. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది.  నాని 15 ఏండ్ల సినీ కెరీర్ లో కనీవినీ ఎరుగని బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. రూ. 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమా నాని కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లు అయ్యింది. కొత్త దర్శకుడిపై నాని పెట్టుకున్న నమ్మకం వందకు వంద శాతం నెరవేరింది. అలాంటి దర్శకుడితో మళ్లీ సినిమా చేయాలి అని ఎవరైనా అనుకుంటారు. ప్రస్తుతం నాని కూడా అదే పని చేయబోతున్నారు.

‘హిట్ 3’ పూర్తయ్యాక శ్రీకాంత్ తో సినిమా!

‘దసరా’ దర్శకుడితో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే తనతో సినిమా చేస్తానని శ్రీకాంత్ కు నాని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘NANI30’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ‘హిట్ 3’ని పూర్తి చేయనున్నారు. అనంతరం శ్రీకాంత్ ఓదెలతో  మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట.  ఈ లోగా మంచి కథ రెడీ చేయాలని శ్రీకాంత్ కు సూచించారట. శ్రీకాంత్, నాని కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు కూడా ‘దసరా’ నిర్మాతే కంటిన్యూ అవుతున్నారు. హీరో, డైరెక్టర్, నిర్మాత ఓకే కాగా, హీరోయిన్ కీర్తి సురేషన్ ను కంటిన్యూ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

నాని నమ్మకాన్ని నిలబెట్టిన శ్రీకాంత్

వాస్తవానికి ‘దసరా’ సినిమా విషంలో నాని, శ్రీకాంత్ మీద ఎంతో నమ్మకం పెట్టారు. ‘దసరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విడుదలయ్యాక, సెకెండాఫ్ మీద కొంత మిశ్రమ స్పందన వచ్చినా, దర్శకుడిగా శ్రీకాంత్ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. ఆయనలో కంటెంట్ గట్టిగానే ఉందనే విషయం వెల్లడి అయ్యింది. అతడికి స్టార్ హీరోల సినిమాలను హ్యాండిల్ చేసే సత్తా ఉందని ఇండస్ట్రీ పెద్దలు సైతం గుర్తించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంత కథను బేస్ చేసుకుని చక్కటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తీశాడు. వీరి కాంబో మళ్లీ రిపీట్ కావడం పల్ల సినీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ప్రస్తుతం నాని  #NANI30 సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

Read Also: నేను ముద్దు సీన్లలో ఎందుకు నటించడం లేదంటే? అసలు విషయం చెప్పిన ప్రియమణి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trisha Krishnan: మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
Bollywood: విడాకుల దిశగా 'విశ్వంభర' ఐటమ్ సాంగ్ బ్యూటీ... హింట్ గమనించారా?
విడాకుల దిశగా 'విశ్వంభర' ఐటమ్ సాంగ్ బ్యూటీ... హింట్ గమనించారా?
NTR Neel Movie Teaser: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్‌ప్రైజ్... బర్త్ డే కంటే ముందు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్‌ప్రైజ్... బర్త్ డే కంటే ముందు
Rahul Ramakrishna: ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు
ఖాళీ థియేటర్లు... చెత్త సినిమాలు... రాహుల్ రామకృష్ణ సెన్సేషనల్ ట్వీట్లు

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget