News
News
X

Bigg Boss 6 Telugu: మించిపోతున్న శ్రీసత్య వెటకారం, తొలిసారి రేవంత్ - శ్రీహాన్ మధ్య గొడవ

Bigg Boss 6 Telugu:ఇంట్లో శ్రీసత్య ఆట కన్నా అందంతోనే నెట్టుకొస్తోంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: నిజం చెప్పాలంటే ఇంట్లో శ్రీసత్య అద్భుతంగా ఆడిన ఆటలేవీ లేవు. అర్జున్ ఉన్నాన్నాళ్లు అతడిని వెంట తిప్పుకుంటూ కంటెంట్ ఇచ్చింది. హోటల్ టాస్కులో కూడా అతడికి అన్నం తినిపించినందుకు డబ్బులు, మీద చేయి వేయించుకుని ఫోటో తీయించుకున్నందుకు డబ్బులు తీసుకుంది. అది పెద్ద ఆటేం కాదు. కానీ శ్రీహాన్‌తో స్నేహం చేసి వెటకారానికి కేరాఫ్ అడ్రెస్ లా మారింది. ఇద్దరూ కలిసి పక్కవాళ్లని చూసి వెటకారం చేస్తూ కెమెరాలకు కంటెంట్ ఇస్తున్నారు. ఇంట్లు ఉన్న వారిలో శ్రీసత్యే అందంగా ఉండడం కూడా ఆమెకు కలిసివచ్చింది. అందుకేనేమో బిగ్ బాస్ కూడా ఇన్నాళ్లు ఆమెను ఉంచాడు. కానీ ఆమె కీర్తి, ఇనాయ, రేవంత్... ఇలా కొందరి విషయంలో ప్రవర్తిస్తున్న తీరు ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఆమెకు ‘అసత్య’ అనే నిక్ నేమ్ కూడా ఇచ్చారు. 

నామినేషన్ల అనంతరం కీర్తిని మళ్లీ ఇమిటేట్ చేసి బాధపెట్టింది శ్రీసత్య. కీర్తిలా గెంతుకుంటూ వెళ్లి ... మొదట్లో ఇలా ఉన్న కీర్తి నువ్వు కాదు అంటూ ఇమిటేట్ చేసింది. దీంతో కీర్తి ఫీలై ‘ఈ వెటకారమే వద్దు’ అంటూ గట్టిగా చెప్పింది. 

శ్రీహాన్ వర్సెస్ రేవంత్
ఇంట్లో స్నేహంగా ఉండేవారు ఎవరంటే రేవంత్, శ్రీహాన్ పేర్లే చెబుతారు ఎవరైనా. ఈరోజు ఎందుకో వీరి మధ్య కూడా గొడవ జరిగింది. ఫుడ్ విషయంలో రేవంత్ తింటానని,తినను అని రెండు మాటలు చెప్పడంతో శ్రీహాన్ సీరియస్ అయ్యాడు. ‘ఏదైనా ఒక మాట చెబితే ఒక మాట మీద ఉండు’ అన్నాడు శ్రీహాన్. దానికి రేవంత్ ‘మిస్టేక్స్ వెతకడం స్టార్ట్ చేస్తే నీ కన్నా నేను నీలో ఎక్కువ మిస్టేక్స్ వెతుకుతా’ అన్నాడు. దానికి శ్రీహాన్ ‘వెతుకు’ అంటూ సమాధానం ఇచ్చాడు. తరువాత శ్రీసత్య దగ్గరకు వెళ్లి ముచ్చట్లు పెట్టాడు శ్రీహాన్. ‘నన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాడట. ఫ్రెండ్ అయితే ఇంట్లోంచి పంపించేసి చెప్పను నేను, పక్కకు తీసుకెళ్లి చెబుతా’ అంటూ కనిపించాడు శ్రీహాన్. 

News Reels

Also read: నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు ఖాళీ చెక్ ఇచ్చిన బిగ్‌బాస్, ఎవరు ఎక్కువ రాస్తే వారు సేఫ్, కానీ పెద్ద ట్విస్టు

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Published at : 15 Nov 2022 08:16 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Sri Sathya Inaya sulthana

సంబంధిత కథనాలు

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

Bigg Boss 6 Telugu Episode 83: ఎట్టకేలకు కెప్టెన్ అయిన ఇనాయ - అమ్మ కోరిక తీర్చింది, మట్టి తింటున్న ఫైమా

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!