Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లో శోభా శెట్టిపై ప్రేక్షకుల్లో తీవ్రమైన నెగిటివిటీ ఉంది. అయినా కూడా తను ఎలిమినేట్ అవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Shobha Shetty Elimination: ఒక్కొక్కసారి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే హౌజ్‌మేట్స్.. ప్రేక్షకులకు నచ్చకపోయినా కూడా వారు ఎలిమినేట్ అవ్వరు. ఓట్లు పడకపోయినా కూడా అసలు వారు ఎలా హౌజ్‌లో ఉంటున్నారు? ఒకవేళ బిగ్ బాస్ మేకర్స్ వారిని స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టి గురించి కూడా ప్రేక్షకుల అనుమానం అదే. ఎన్నో వారాల నుంచి శోభా ప్రవర్తనపై ఆడియన్స్‌లో నెగిటివిటీ పెరిగిపోతోంది. ఇప్పటికీ ఎన్నోసార్లు తనే ఎలిమినేట్ అవుతుంది అనే రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. కానీ చూస్తుండగానే.. శోభా ఫైనల్ వీక్ వరకు వచ్చేసింది. కనీసం ఈ వారమైన ఎలిమినేట్ అవుతుందేమో అని ప్రేక్షకులు చూస్తున్నారు.
అందరితో గొడవ..
సీజన్ ప్రారంభమైనప్పుడు శోభా శెట్టి ప్రవర్తన మామూలుగానే ఉండేది. కానీ ఒకసారి గౌతమ్‌తో జరిగిన గొడవ వల్లే శోభా ఏ రేంజ్‌లో అరవగలదు అని అందరికీ అర్థమయ్యింది. అప్పటినుంచి శివాజీ, యావర్‌లతో పలుమార్లు గొడవలు జరిగి.. వాటి వల్లే తను హైలెట్ కూడా అయ్యింది. ఆ గొడవల వల్లే ప్రేక్షకుల్లో తనకు నెగిటివిటీ కూడా ఏర్పడింది. అప్పటినుంచి తను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఫైనల్స్ దగ్గర పడుతుండడంతో శోభాలో ధీమా ఎక్కువయిపోయి తన ప్రవర్తన మరింత దారుణంగా మారిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
డేంజర్ జోన్‌లో ఉన్నా..
ముఖ్యంగా అమర్‌దీప్‌ను కెప్టెన్ చేసే విషయంలో శోభా.. అందరినీ టార్గెట్ చేసిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువ నెగిటివిటీ ఉన్నా.. తనకు ఓట్లు ఎవరు వేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. గతవారం గౌతమ్.. ఎలిమినేషన్ సమయంలో తనతో పాటు శోభా కూడా డేంజర్ జోన్‌లో ఉంది. అప్పుడు ఆడియన్స్ పోల్ కూడా జరిగింది. గౌతమ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన తర్వాత ఆడియన్స్ పోల్‌లో కూడా శోభా ఎలిమినేట్ అవుతుందని సగంకంటే ఎక్కువమంది ఓటు వేశారు. అయినా కూడా శోభాను కాకుండా గౌతమ్‌ను ఎలిమినేట్ చేసినందుకు ఈ లేడీ విలన్‌పై కచ్చితంగా బిగ్ బాస్ ఫేవర్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
బిగ్ బాస్‌కు థ్యాంక్స్..
ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నందుకు శోభా.. ప్రేక్షకులకు కాకుండా బిగ్ బాస్‌కు థ్యాంక్స్ అని చెప్పింది. అంటే తనను సేవ్ చేసింది ప్రేక్షకులు కాదా..? బిగ్ బాసా? అని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నా కూడా కావాలనే బిగ్ బాస్.. శోభాను కాపాడుతున్నాడని, ఇక మిగత హౌజ్‌మేట్స్ ఎందుకు కప్ కూడా ఆమెకే ఇచ్చేయండి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం హౌజ్‌లో మిగిలిన ఏడుగురిలో శోభా పట్లే ప్రేక్షకుల్లో ఎక్కువ నెగిటివిటీ ఉంది. అందుకే తను ఈ వారమైనా ఎలిమినేట్ అయితే బాగుంటుందని హేటర్స్ కోరుకుంటున్నారు. ఓటు అప్పీల్ కోసం తనకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా తాను లాస్ట్‌లో లేనని చెప్తూ వాదించింది. ఆ విషయం కూడా ప్రేక్షకుల్లో నెగిటివిటీని పెంచింది.
Also Read: ఫలించిన అమర్ శాపం - అర్జున్, యావర్‌లకు బిగ్ బాస్ కేక్ టాస్క్