అన్వేషించండి

Priyanka Jain: నీ ప్రవర్తన నచ్చలేదంటూ లెటర్ రాసి వెళ్లిపోయిన ప్రియాంక ప్రియుడు శివ్, కన్నీళ్లు పెట్టుకున్న బీబీ బ్యూటీ

Bigg Boss Priyanka Jain: ఎప్పుడూ ఒకరిపై ఒకరు ప్రాంక్స్ చేసుకుంటూ సరదాగా ఉంటారు ప్రియాంక, శివ్. కానీ ఈసారి ప్రాంక్ కాస్త ఓవర్ అయ్యింది. దానివల్ల ప్రియాంక కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

Shiv Prank on Priyanka Jain: బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్.. హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన పర్సనల్ లైఫ్‌తో బిజీ అయిపోయింది. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ప్రియాంక, శివ్ కలిసి చేసే వీడియోలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రాంక్స్ చేసుకుంటూ తమ ఛానెల్ వ్యూయర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. తాజాగా ప్రియాంక, శివ్ అనుకోకుండా గోవాకు వెళ్లారు. అక్కడే ప్రియాంకపై తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రాంక్ చేయాలని శివ్ నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాంక్ వీడియో మొత్తాన్ని తమ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు.

ప్రియాంకపై ప్రాంక్..

తాజాగా ప్రియాంక, శివ్‌తో పాటు వారి ఇద్దరి ఫ్రెండ్స్‌తో పాటు అనుకోకుండా గోవాకు వెళ్లారు. మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి కూర్చున్నారు. కానీ ప్రియాంక మాత్రం ఇంకా లేవలేదు. అక్కడే ప్రియాంకపై ప్రాంక్ చేయమని శివ్‌కు తన ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. అప్పుడే శివ్‌కు ఒక ఐడియా వచ్చింది. ప్రియాంక ప్రవర్తన నచ్చక అందరం వెళ్లిపోతున్నామని లెటర్ రాద్దామని, అది తను కచ్చితంగా నమ్ముతుందని శివ్ ప్లాన్ చేశాడు. ఆ ప్రాంక్ అసలు తను ఎప్పటికీ మర్చిపోకూడదని, కళ్లలో నుంచి నీళ్లు రావాలని అన్నాడు. అలా లెటర్ రాసిన తర్వాత ముందుగా రూమ్ చుట్టూ తమ ఐఫోన్ కెమెరాలను ఫిక్స్ చేశారు. తమ లగేజ్ అంతా తీసుకొని కారులో పెట్టుకొని బయటికి వెళ్లిపోయారు.

పాపం ప్రియాంక..

వారు అనుకున్నట్టుగానే ప్రియాంక లేచి హాల్‌లో వాళ్లు పెట్టిన లెటర్ చదివింది. ఇదంతా వారు దాచిపెట్టిన కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ లెటర్ చదవగానే తాను ఏం చేశానని టెన్షన్ పడుతూ అందరికీ ఫోన్లు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎవ్వరి ఫోన్ కలవలేదు. దీంతో కంగారుపడి బయటికి వెళ్లి వెతుకుదామని బయల్దేరింది. అయితే ప్రియాంక ఎక్కడెక్కడికి వెళ్తుందో డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేద్దామని శివ్ ఫిక్స్ అయ్యాడు. కంగారుగా ప్రియాంక అటు ఇటు పరిగెత్తింది. అక్కడే ఉన్న వాచ్‌మ్యాన్‌ను వారి గురించి అడిగింది. అయినా తనకు ఏం అర్థం కాలేదు. ప్రియాంక టెన్షన్‌ను చూసి శివ్ ఎంజాయ్ చేశాడు. ప్రియాంక మాత్రం ‘‘అసలు నేనేం చేశాను. నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయారు’’ అని తనతో తానే అనుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది.

శివ్ సంతోషం..

ప్రియాంక చాలా ఏడ్చిన తర్వాత తన ముందుకు వచ్చాడు శివ్. అసలు కనిపించకుండా ఎక్కడికి వెళ్లిపోయారంటూ తనపై కోప్పడింది ప్రియాంక. తన ఫ్రెండ్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశానని, అయినా వారు వినలేదని శివ్.. తన ప్రాంక్‌ను కంటిన్యూ చేశాడు. దీంతో నేనేం చేయలేదు అంటూ శివ్‌ను పట్టుకొని ఏడ్చేసింది ప్రియాంక. అప్పుడు తన ఫ్రెండ్స్‌ను పిలిచి, ఇదంతా ప్రాంక్ అని నవ్వుతూ చెప్పాడు. దాంతో ప్రియాంకు కోపం వచ్చి శివ్‌ను కొట్టింది. ఫైనల్‌గా ప్రియాంకపై సక్సెస్‌ఫుల్‌గా ప్రాంక్ చేశానని చెప్తూ తెగ మురిసిపోయాడు శివ్. తనకోసం అరిచిందని, ఏడ్చిందని, తిరిగిందని గుర్తుచేసుకొని నవ్వుకున్నాడు. అయితే ఇంత సీరియస్ ప్రాంక్ చేసి ప్రియాంకను ఏడిపించడం తమకు నచ్చలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: మెగా ఫ్యాన్స్ ‌కు గుడ్ న్యూస్ - ‘లవ్ మీ’ వేదికగా 'గేమ్ ఛేంజ‌ర్‌' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget