అన్వేషించండి

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటికే పలు గ్రూప్స్ ఉన్నాయి. అయితే తన గ్రూప్‌కు సపోర్ట్ చేస్తూ వ్యక్తిగతంగా ఆడడం మానేసింది ప్రియాంక. దీంతో నాగార్జున సీరియస్ అయ్యారు.

Telugu Bigg Boss 7: ఫినాలే అస్త్రా రేసులో ఒకటి కాదు, రెండు కాదు దాదాపు పదికి పైగా టాస్కులను ఆడారు కంటెస్టెంట్స్. అయితే ఇన్ని టాస్కుల్లో ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక తప్పు చేశారు. ఆ తప్పులను గుర్తుచేయడానికి, వాటిపై క్లారిటీ తీసుకోవడానికి నాగార్జున వచ్చేశారు. ముందుగా టాస్కుల్లో తక్కువ పాయింట్లు వచ్చిన వారితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారికంటే ఎక్కువ పాయింట్లు సాధించినవారితో మాట్లాడుతూ వచ్చారు. ఇక శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో విడుదలయ్యింది. అందులో ముందుగా యావర్‌తో మాట్లాడడం మొదలుపెట్టారు నాగార్జున. ఆ తర్వాత పాయింట్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయం గురించి గౌతమ్‌తో కూడా చర్చించారు.

యావర్, గౌతమ్ తప్పులను గుర్తుచేస్తూ..
‘‘ఇసుక టాస్కులో నువ్వు చేసిందేంటి?’’ అని ముందుగా టాస్కులో యావర్ చేసిన తప్పు గురించి అడిగారు నాగార్జున. ‘‘నా కీ కూడా కిందే దొరికింది. బాక్స్‌లో కాదు’’ అని బయటపెట్టాడు యావర్. ‘‘నీ అవకాశాన్ని ఎవరో పాడుచేశారని, ఇంకొకరి అవకాశాన్ని నువ్వు పాడుచేయకూడదు కదా’’ అని క్లారిటీ ఇచ్చారు నాగ్. యావర్ తర్వాత ఫినాలే అస్త్రా రేసు నుండి తప్పుకున్న కంటెస్టెంట్ గౌతమ్. అందుకే తనతో మాట్లాడడం మొదలుపెట్టారు. ‘‘ఆ జెండాను పైకి ఎత్తావు కదా. అందులో నీ స్ట్రాటజీ ఏంటి?’’ అని అడిగి గౌతమ్‌ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు నాగార్జున. ‘‘ఒకవైపు ఇసుక తీసేస్తే అక్కడ బరువు తగ్గి జెండాపైకి లేస్తుందని ప్లాన్ చేశాను’’ అని గౌతమ్.. తన స్ట్రాటజీ గురించి చెప్పాడు. దానికి నాగార్జున వ్యంగ్యంగా నవ్వాడు.

తనను తాను సమర్ధించుకున్న ప్రియాంక..
ఇక ఫినాలే అస్త్రా వీక్‌లో హైలెట్‌గా నిలిచిన గౌతమ్ పాయింట్ల విషయం కూడా నాగార్జున ప్రస్తావించారు. ‘‘ఒక్కటయితే క్లియర్‌గా అర్థమయిపోయింది నాకు. అర్జున్ అన్న కంటే నీకు ప్రియాంక చెల్లి ముఖ్యం’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘‘ఇప్పటినుండి కేవలం ఒక్కరుగానే ఆడాలి. గ్రూప్ గేమ్స్ వద్దు’’ అని ప్రియాంకకు కూడా చెప్పారు. అయితే నాగార్జున అన్న మాటకు సమాధానంగా.. ‘‘ఇది నా వ్యక్తిగత గేమే’’ అని ఆన్సర్ ఇచ్చింది. ఆ సమాధానం నచ్చని నాగార్జున.. ‘‘ఏ విధంగా వ్యక్తిగత గేమ్ ఇది?’’ అని అడిగారు. ‘‘గౌతమ్ పాయింట్లు ఎవరికి ఇద్దామనుకున్నాడో అది తన ఇష్టం. నువ్వు వెళ్లి అడగడం అది వ్యక్తిగత గేమా? లేదా అమర్ బాగా ఫీల్ అయిపోతున్నాడు. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేశాడు అని చేశావా’’ అని ప్రియాంకను క్లియర్‌గా ప్రశ్నించారు. ‘‘నిజం చెప్పాలంటే నేను నా గేమ్ ఆడుతున్నాను. నా బెస్ట్ నేను ఇస్తున్నాను’’ అని ప్రియాంక.. తనను తాను సమర్థించుకుంది. ‘‘నీ ఉద్దేశ్యంలో వ్యక్తిగతం అంటే ముగ్గురు’’ అని నాగార్జున అన్న మాటకు అడ్డంగా తలూపింది.

గౌతమ్‌పై నాగ్ సీరియస్..
‘‘ప్రతీసారి శివాజీని నిలదీసింది ఏంటి - ఇద్దరికి మాత్రమే సపోర్ట్ ఉన్నాడు అని. మరి అదే విధంగా ప్రియాంకను కూడా నువ్వు అడగాలి కదా’’ అని గౌతమ్‌తో చెప్పారు నాగార్జున. ఆయన అన్నమాటను అవును అని ఒప్పుకున్నాడు గౌతమ్. మరెందుకు అడగలేదు అని ప్రశ్నించారు నాగ్. దానికి గౌతమ్ ఏదో సమాధానం చెప్తుండగానే మధ్యలో జోక్యం చేసుకున్న నాగ్.. ‘‘ఎప్పటినుండి అని కాదు.. ప్రియాంక ఆడింది వ్యక్తిగతమైన గేమా నాకు తెలుసుకోవాలని ఉంది. నువ్వేం అనుకుంటున్నావో చెప్పు’’ అని గౌతమ్‌ను సీరియస్‌గా అడిగారు. దానికి గౌతమ్ దగ్గర సమాధానం లేక సైలెంట్‌గా నిలబడ్డాడు.

Also Read: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Embed widget