అన్వేషించండి

నా ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ ఇచ్చింది నాగార్జునే - బిగ్‌బాస్ ఫినాలేలో రవితేజ

బిగ్ బాస్ ఫినాలే ధూంధాంగా జరుగుతోంది. ప్రోమో అదిరిపోయేలా ఉంది.

బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపుకు వచ్చేసింది. ధూంధాంగా ఫినాలే వేదిక సిద్ధమైంది. ప్రోమోను చూస్తుంటేనే ఎంత వేడుకగా సాగుతుందో అర్థమైపోతుంది. ఈ ఫినాలేకు ప్రత్యేక అతిధిగా వచ్చారు రవితేజ. ఆయన సినిమా ధమాకా విడుదల సందర్భంగా పనిలో పని ప్రమోషన్ కూడా అవుతుంది కాబట్టి హీరోయిన్ శ్రీలీలను కూడా తీసుకొచ్చారు. వేదికపై నాగార్జున శ్రీలీలతో ‘రవితేజ నాకు ఎప్పట్నించో తెలుసో నీకు తెలుసా?’ అని అడిగారు. దానికి రవితేజ ‘నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ ఇచ్చింది నాగార్జునే’ అని చెప్పారు. దాన్ని దాచుకోవాలనుకున్నానని, కానీ అవసరం వచ్చి వాడేశానని చెప్పుకొచ్చారు. దాంతో నాగార్జున నవ్వేశారు. 

రవితేజ చాలా లేటుగా హీరో అయ్యారు. అంతకుముందు చిన్న చిన్న పాత్రలు, హీరో ఫ్రెండు క్యారెక్టర్లు చేశారు. 1991లో నాగార్జున నటించిన చైతన్య సినిమా చాలా చిన్న రోల్ చేశారు రవితేజ. అలాగే క్రిమినల్, నిన్నె పెళ్లాడతా సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించారు.  1997లో వచ్చిన సింధూరంలో తొలిసారి ఫుల్ లెంగ్త్ పాత్ర చేశారు. ఇక ఆయన జీవితాన్ని మార్చిన సినిమా అయితే ‘ఇడియట్’ అనే చెప్పాలి. ఆ తరువాత అతను స్టార్ హీరో అయిపోయారు. 

బ్రీఫ్‌కేసు ఇచ్చి..
బిగ్ బాస్ సీజన్ 6కు అతిధిగా వచ్చిన రవితేజను బ్రీఫ్‌కేసు ఇచ్చి లోపలికి పంపిస్తున్నట్టు చెప్పారు నాగార్జున. ఆ బ్రీఫ్ కేసులో ఎంత డబ్బుందో, దాన్ని ఎవరైనా తీసుకుని బయటికి వచ్చారో లేదో ఫినాలే చూస్తేనే అర్థమయ్యేది. ప్రస్తుతం టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ ఉన్నారు. వీరిలో విన్నర్ అయ్యేది ఎవరో ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే రేవంత్ గెలిచినట్టు సమాచారం వస్తోంది.

గతంలో బిగ్ బాస్4లో సోహైల్ బాగా ఆలోచించి పాతిక లక్షల బ్రీఫ్ కేసు పట్టుకుని బయటికి వచ్చేశాడు. విన్నర్ కన్నా అతనికే ఎక్కువ మొత్తం అందింది ఆ సీజన్లో. మరి ఈ సీజన్లో ఎవరైనా అలా బ్రీఫ్ కేసుతో బయటికి వస్తారేమో చూడాలి. 

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే:

1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్  (సింగర్)

Also read: ‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలే లైవ్ అప్‌డేట్స్: హౌస్‌లో మొదలైన సందడి - రాధా, రవితేజ, నిఖిల్ రచ్చ మామూలుగా లేదు

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget