Inaya Sulthana: ఇనయాకు ‘బిగ్ బాస్’ ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? ఆమె ఫ్యాన్స్‌కు ఇది ఓదార్పే!
ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయ్యాక ఆమె కన్నా ప్రేక్షకులే ఎక్కువ బాధపడ్డారు.
ఇనయా విన్నర్ కాకుండా వెనుదిరిగినా ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు, బాగా ఆడినందుకు టాప్ 5లో ఉందన్న సంతృప్తి జనాలకు కలిగేది. కానీ ఆమెను అన్యాయంగా ఫైనల్‌కి చేర్చకుండానే తీసేయడం చాలా చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ సీజన్ 6 చప్పగా ఉన్నా కూడా ఎంతో కొంత ప్రజలు చూశారంటే దానికి కారణం రేవంత్, ఇనాయ, గీతూలే. గీతూ అతి యాక్షన్ వల్ల బయటికి వెళ్లిపోయింది. ఇనాయ అతిగా ప్రవర్తించకపోయినా, చక్కగా ఆడుతున్నా కూడా అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. దీంతో ట్విట్టర్లో పెద్ద యుద్దమే చేశారు బిగ్ బాస్ ప్రేక్షకులు. వారంతా ఇనాయ అభిమానులు అని చెప్పలేం. కానీ ఆమె టాప్ 5కి వెళ్లకపోవడం అన్యాయమని భావించినవాళ్లే. ఇంట్లో ఉన్న శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి మీద కచ్చితంగా ఈమె బెటర్ అని మాత్రం ఫీలైన వాళ్లే. ఇక ఇనాయ 14 వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉంది. ఇందుకు ఆమె ఎంత మొత్తం అందుకుందనే విషయంపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.
వారానికి ఎంత?
బిగ్ బాస్ వారానికి ఇంత ఇస్తానని మాట్లాడుకుంటారు. అలా ఇనాయకు వారానికి లక్ష ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకు పదిహేను వేల రూపాయలన్న మాట. ఆమె 14 వారాలు ఉన్నందుకు 14 లక్షల రూపాయలు అందుకుందని భావిస్తున్నారు. బిగ్ బాస్‌కు రాకముందు ఆమె ఎవరో కూడా ఎంతో మందికి తెలియదు. వచ్చాక చక్కటి గుర్తింపు, అభిమానులకు సంపాదించుకుంది. ఈ గుర్తింపు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
కష్టాలను తట్టుకుని...
ఈ సీజన్లో ఎక్కువ మంది టార్గెట్ చేసింది ఇనయానే. శ్రీహాన్, ఫైమా, గీతూ, శ్రీసత్య, ఆదిరెడ్డి ఆమె కఠినమైన మాటలతో, ప్రవర్తనతో వ్యక్తగతంగా ఆమెపై దాడి చేశారు. వీరంతా ఒక్కటై ఆమెను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆమె వాటికి తొణకలేదు. బిగ్ బాస్‌కు రాక ముందే ఆమె ఎన్నో బాధలు పడి వచ్చింది. కుటుంబానికి దూరమై ఒంటరైంది. కేవలం సినిమా కలను నిజం చేసుకునేందుకు కన్న కుటుంబాన్ని, ఊరిని వదిలి హైదరాబాద్ చేరింది. కష్టపడి చిన్న చిన్న పాత్రలు సాధించింది.
ఆ వీడియో...
రామ్ గోపాల్ వర్మతో ఆమె డ్యాన్సు చేసిన వీడియో వైరల్‌గా మారడంతో బిగ్ బాస్ దాకా చేరింది ఆమె కథ. తన బర్త్ డే పార్టీలో ఆ వీడియో ఎవరు తీశారో కూడా తెలియదని, కానీ అది వైరల్ అయిందని చెప్పింది ఇనాయ. ఆ వీడియో చూశాక ఆమె కుటుంబం పూర్తిగా దూరమైందని, అందరూ తనతో మాట్లాడడం కూడా మానేశారని ఓ ఇంటర్య్వూలో చెప్పింది. తన తల్లి తనతో మాట్లాడి రెండేళ్లు అయిందని తెలిపింది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఇనయా తల్లి కూతురిని చూసేందుకు రెండేళ్ల తరువాత వచ్చింది. అదే తన బెస్ట్ మూమెంట్ అని ఎలిమినేట్ అయ్యాక చెప్పింది ఇనాయ.
Also read: యాంకర్ శివకు ఇచ్చిపడేసిన ఇనాయ - వంకరగా మాట్లాడితే ఊరుకుంటుందా?