అన్వేషించండి

వాళ్ళ ముందు ఏడవలేకపోతున్నా బిగ్ బాస్ - కన్నీటి పర్యంతమైన శివాజీ!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శివాజీ భుజం నొప్పితో బాధపడుతున్నానని బిగ్ బాస్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో నడుస్తున్న కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ కోసం జరుగుతున్న టాస్క్ లో ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబి పురం రెండు భాగాలుగా విడిపోయి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులు స్కిట్ చేస్తూనే మధ్య మధ్యలో వచ్చే టాస్కుల్లో పాల్గొన్నారు. అలా సమయానుసారం బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇచ్చి ఆటను మరింత రసవత్తరంగా మార్చారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరింది. ఆ చివరి టాస్క్ ఏంటంటే, ఈ వారానికి కెప్టెన్సి పోటీదారులుగా నిలిచి బృందంలోని సభ్యులు మిగిలిన వారిలో ఒకరిని అనర్హుడిగా ప్రకటించి అతని ఫోటోకు గొలుసు కట్టి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

ఈ క్రమంలోనే చివరగా ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగిపోకుండా ఉంటుందో వారు కెప్టెన్సీ కంటెండర్ గా కొనసాగుతారని అన్నారు. తాజా ఇందుకి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో మొత్తం అమర్, శివాజీ ల మధ్య డిస్కషన్జ్ శివాజీ హెల్త్ కండిషన్ పైనే నడిచింది. ఒకసారి ప్రమోను పరిశీలిస్తే.. టాస్క్ లో భాగంగా అమర్ దీప్ శివాజీ ఫోటోకు గొలుసు కట్టి పూల్ లో పడేయాలని అనుకుంటాడు. దాంతో రీజన్ చెప్పి ఫోటోను పూల్ లో పడేయొచ్చని శివాజీ అంటాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 'మీ కన్నా ఇతరులు ఎక్కువగా కష్టపడి ఆడారు కదా, ఒక ఛాన్స్ ఇద్దామని' అంటూ అమర్ చెప్పగా.." నేను వేస్ట్ క్యాండిడేట్ లా కనిపిస్తున్నానా? ఇది న్యాయమైన ఆటా?" అంటూ శివాజీ అసహనం వ్యక్తం చేశారు.

"ఇక్కడ తప్పు, ఒప్పు, మంచి చెడు ఏం లేదు' అని శివాజీ హౌస్ మేట్స్ తో చెప్పడంతో అమర్, 'అన్న ఆడాడు, ఆడించాడు. కానీ అన్న కంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ బేసిస్ మీద మాత్రమే శివాజీ అన్నని సెలెక్ట్ చేసుకున్నాను" అంటూ సమాధానం ఇస్తూ శివాజీ ఫోటోలు స్విమ్మింగ్ పూల్ లో పడేస్తాడు. అనంతరం బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, 'శివాజీ ఎలా ఉన్నారు?' అని ప్రశ్నించగా.." బాగా ఇబ్బంది పడుతున్న బిగ్ బాస్. చేయి అంతా లాగుతుంది. ఎవరు లేకపోతే నేనే ఏడుస్తున్న. ఎవరైనా ఉంటే నవ్వుతో ఏడుస్తున్నా. వాళ్ళ అందరి ముందు ఏడవలేకపోతున్నా. లోపల చాలా బరువుగా ఉంది" అంటూ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు.

దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం శివాజీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ అతన్ని ఇంటికి పంపించేస్తారా? లేక ట్రీట్మెంట్ కోసం బయటికి తీసుకొస్తారా? అనేది చూడాలి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల కిందట ఓ టాస్క్ లో భాగంగా శివాజీ గాయపడిన విషయం తెలిసిందే  ఆయన భుజానికి గాయం అవడంతో చేతికి సపోర్ట్ బ్యాండ్ ధరించి కనిపిస్తున్నారు. టాస్క్ లో కూడా అలాగే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆమధ్య స్కానింగ్ కోసం బిగ్ బాస్ ఆయన్ని బయటికి కూడా తీసుకొచ్చారు. అయినా కూడా నొప్పి తగ్గకపోవడంతో బిగ్ బాస్ శివాజీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

Also Read : నా ఫోకస్ వాటిమీదే - పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget