News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి

బిగ్ బాస్ 7 ప్రారంభంలోనే పల్లవి ప్రశాంత్.. రతికకు అట్రాక్ట్ అయ్యాడని చూసిన ప్రేక్షకులు అందరికీ తెలుసు. కానీ మెల్లగా వారి మధ్య గొడవలు పెరిగాయి. ఇప్పటికీ ఆ మనస్పర్థలు క్లియర్ అవ్వలేదని అర్థమవుతోంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక గొడవ.. మరొక గొడవకు దారితీస్తుంది. అలాంటివి ఎక్కువగా నామినేషన్స్ సమయంలోనే జరుగుతాయి. ఒక కంటెస్టెంట్ చెప్పిన నామినేషన్ కారణాన్ని మరొక కంటెస్టెంట్ కచ్చితంగా ఒప్పుకోరు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన కంటెస్టెంట్.. పాత విషయాలను కూడా గుర్తుచేస్తారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన నాలుగో వారం నామినేషన్స్‌లో కూడా అదే జరిగింది. పల్లవి ప్రశాంత్, రతిక.. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవ్వగానే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ మెల్లగా వీరిద్దరి మధ్య అనేక మనస్పర్థలు వచ్చాయి. అసలు ఈ ఇద్దరు ఎప్పుడు మంచిగా మాట్లాడుకుంటున్నారో.. ఎప్పుడు గొడవపడుతున్నారో.. చూసే ప్రేక్షకులకు మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్‌కు కూడా అర్థం కాలేదు. తాజాగా నామినేషన్స్ పూర్తయిన తర్వాత కూడా వీరిద్దరికి వాగ్వాదం జరిగింది.

పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి ముందుగా రతిక.. తనను ఒక మంచి ఫ్రెండ్‌లాగా చూస్తూ.. తనతో చాలా క్లోజ్ ఉంది. కానీ మధ్యలో కంటెస్టెంట్స్ అందరూ రెచ్చగొట్టడం వల్ల ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. అప్పటినుండి వీరి మధ్య మాటలు తగ్గిపోయాయి. ఇప్పుడు తనకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని మరీ.. ప్రశాంత్‌పై ఆరోపణలు చేస్తోంది రతిక. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు అమర్‌దీప్. అప్పుడు తనకు సంబంధం లేకపోయినా మధ్యలో మాట్లాడి ప్రశాంత్‌కు రెండు మొహాలు ఉన్నాయి అని నిరూపించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్న సమయంలో కూడా రతిక జోక్యం చేసుకొని గొడవను పూర్తిగా తనవైపుకు తిప్పుకుంది.

గౌతమ్.. శోభా శెట్టి ముందు షర్ట్ విప్పి తిరిగాడు అనే కారణంతో తనను నామినేట్ చేశాడు ప్రశాంత్. అయితే అలా చేయడం బాడీ షేమింగ్ అని, అలా తను ఎప్పుడూ చేయలేదు అని వాదించాడు గౌతమ్. అంతే కాకుండా ప్రశాంత్.. రతికను బాడీ షేమింగ్ చేశాడని, తన బట్టల మీద కామెంట్ చేశాడని రతికను మధ్యలోకి లాగాడు. దీంతో గొడవ మొత్తం రతిక, పల్లవి ప్రశాంత్‌పైకి టర్న్ అయిపోయింది. రతిక డ్రెస్సింగ్ గురించి ముందుగా గొడవ మొదలయ్యింది. నోటికి వచ్చినట్టు మాట్లాడకు అంటూ ప్రశాంత్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది రతిక. ఈ గొడవ మధ్యలోకి ఇతర కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. ‘‘సారీ చెప్పాడని బాగుంటే ఏయ్, ఓయ్ అంటాడు. అతను ఎవరో నాకు బయట కూడా తెలియదు.’’ అంటూ సందీప్‌తో చెప్పడం మొదలుపెట్టింది రతిక. అప్పుడే ప్రశాంత్ కూడా అక్కడికి వచ్చాడు. 

తను ఎవరినైనా అలాగే పిలుస్తానంటూ సమర్ధించుకున్నాడు ప్రశాంత్. ‘‘నిన్ను కూడా ఏయ్ అన్న అంటాను కదా’’ అని సందీప్‌ను ప్రశ్నించాడు. ‘‘నిన్ను వేరు నేనొక అమ్మాయిని. రతిక అనమను. లేదా అక్క, చెల్లి అనమను’’ అంటూ సందీప్‌తో చెప్పింది రతిక. ‘‘చెల్లి అనే పిలుస్తా రేపటినుండి’’ అన్నాడు ప్రశాంత్. ‘‘అదంతా వద్దు నాకొక పేరుంది’’ అని రతిక చెప్తుండగానే.. ‘‘నాకు ఇదంతా వద్దు. రతిక అని కూడా నేను అనను. అక్కా అనే అంటా’’ అని ప్రశాంత్ గట్టిగా చెప్పేశాడు. వారిద్దరు ఒకప్పుడు సరదాగా మాట్లాడుకున్న మాటలు అన్నీ తీసుకొచ్చి గొడవపడడం మొదలుపెట్టారు. శివాజీ వచ్చి ఆ గొడవను ఆపాలని చూశాడు. అయినా వారు వినకుండా గొడవపడుతూనే ఉన్నారు. మొదటిరోజు లేడీ లక్ అని రతికకు తాడు కట్టినప్పుడే తనకు శని వచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ప్రశాంత్. అయితే తను నా ప్రాపర్టీ అన్న విషయాన్ని గుర్తుచేసింది రతిక. ‘‘ఫ్రెండ్ అని నువ్వే అంటావ్. నువ్వే నోటికి వచ్చిన్నట్టు మాట్లాడతావు’’ అంటూ ప్రశాంత్‌కు అవకాశం ఇవ్వకుండా అరవడం మొదలుపెట్టింది రతిక. చివరికి శివాజీ జోక్యం చేసుకోవడంతో గొడవ ఆగింది. చివరిగా రతికకు సారీ చెప్పడంతో పాటు తన పేరు ఎత్తితే చెప్పు తీసుకొని కొట్టు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు ప్రశాంత్.

Also Read: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Sep 2023 11:41 PM (IST) Tags: Bigg Boss Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Bigg Boss 7 Telugu Bigg Boss Telugu 2023 BB 7 Telugu Rathika pallavi prashanth Bigg Boss Season 7 Day 22 Updates

ఇవి కూడా చూడండి

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!