Bigg Boss OTT Telugu: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు, ఎవరెవరంటే?
ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో సరయు ఎలిమినేట్ కాగా.. ఐదో వారం ఎలిమినేషన్ కోసం సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ముందుగా అరియనా.. మహేష్ విట్టా, అనిల్ లను నామినేట్ చేసింది. అషురెడ్డి కూడా ముందుగా మహేష్ విట్టాని నామినేట్ చేసి గతవారంలో అతడి బిహేవియర్ నచ్చలేదని చెప్పింది. ఆ తరువాత బిందుని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో ఆమె అగ్రెసివ్ అయిపోయిందని చెప్పింది. అనిల్ రాథోడ్ ని నామినేట్ చేస్తూ.. కెప్టెన్ గా అతడి ప్రవర్తన నచ్చలేదని కారణం చెప్పింది. ఆ తరువాత మహేష్ విట్టాను నామినేట్ చేసింది. ఈ క్రమంలో మహేష్, స్రవంతిల మధ్య మాటల యుద్ధం జరిగింది. అరియనా, అషురెడ్డిలను నామినేట్ చేసింది హమీద. మహేష్ విట్టాను నామినేట్ చేసిన అఖిల్.. సిల్లీ రీజన్స్ తో తనను నామినేట్ చేశాడని రీజన్ చెప్పాడు. ఆ తరువాత మిత్రాశర్మ ఫేక్ పర్సన్ అని ఆమెని నామినేట్ చేశాడు.
అనంతరం మిత్రాశర్మ.. మహేష్ విట్టా, యాంకర్ శివలను నామినేట్ చేసింది. ఈ విషయంలో శివకి, మిత్రాకి మధ్య పెద్ద గొడవ జరిగింది. శివ ఒక ఫేక్ పర్సన్ అని, చీటర్ అని కామెంట్స్ చేసింది మిత్రా. దీంతో శివ ఫైర్ అయ్యాడు. 'నువ్ ఫేక్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి కానీ నిన్ను ఫేక్ అంటే నువ్ తీసుకోలేవంటూ' మిత్రాపై మండిపడ్డాడు శివ. అలానే మిత్రాకు ఏదైనా విషయం చెబితే ఆమె పక్కవాళ్లకు ఆ విషయాన్ని మోస్తుందనే అనుమానం ఉందంటూ ఆమెని నామినేట్ చేశాడు.
మహేష్ విట్టా కూడా మిత్రాశర్మనే నామినేట్ చేశాడు. అలానే అషురెడ్డిని నామినేట్ చేస్తూ.. కొన్నిసార్లు ఇనీషియేషన్ తీసుకోవడం వలన అవతలి వాళ్లు హర్ట్ అవుతున్నారని రీజన్ చెప్పాడు. మిత్రా, అరియానాలను నామినేట్ చేశాడు అనిల్ రాథోడ్. ఇక నటరాజ్ మాస్టర్.. తేజస్విని నామినేట్ చేయడంతో ఆమె బాధపడింది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని ఏడ్చేసింది. ఆ తరువాత స్రవంతిని నామినేట్ చేశారు నటరాజ్ మాస్టర్. అరియనా, బిందు మాధవిలను తేజస్వి నామినేట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్ అరియనా వలనే పోయిందని ఆమెని నామినేట్ చేశాడు అజయ్. శివ బిహేవియర్ కారణంగా హర్ట్ అయ్యానని అతడిని నామినేట్ చేశాడు. ఫైనల్ గా బిందు.. అరియనా, అషురెడ్డిలను నామినేట్ చేసింది.
ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు బిందు, శివ, అరియనా, అషురెడ్డి, అనిల్, మిత్రా, మహేష్ విట్టా.
Also Read: అమెజాన్ ప్రైమ్ లో 'రాధేశ్యామ్', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
E vaaram evaru nominate ayyaru ani ankuntunnaru? Comment below.
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 28, 2022
Tonight's episode at 9PM on @DisneyPlusHS#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/VAyvxgTRcE
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















