Bigg Boss Telugu Fame VJ Sunny: అమ్మాయిలతో సన్నీ ఎఫైర్లు, 'సకల గుణాభిరామ' ట్రైలర్
సన్నీ 'సకల గుణాభిరామ' అనే సినిమాలో నటించాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
![Bigg Boss Telugu Fame VJ Sunny: అమ్మాయిలతో సన్నీ ఎఫైర్లు, 'సకల గుణాభిరామ' ట్రైలర్ Bigg Boss 5 Telugu Winner VJ Sunny's Sakala Gunabhirama Movie Trailer Bigg Boss Telugu Fame VJ Sunny: అమ్మాయిలతో సన్నీ ఎఫైర్లు, 'సకల గుణాభిరామ' ట్రైలర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/6a6dd3b13a0f89eb18b8ca704a1c3c57_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ 'సకల గుణాభిరామ' అనే సినిమాలో నటించాడు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెస్ట్ లుగా వచ్చారు. బిగ్ బాస్ షోకి వెళ్లకముందే సన్నీ ఈ సినిమాలో నటించారు. అయితే హౌస్ లోకి వెళ్లిన తరువాత అతడి క్రేజ్ బాగా పెరగడంతో ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కథ ప్రకారం.. సన్నీ ఫ్యామిలీ మ్యాన్ గెటప్ లో కనిపించాడు. ఫ్యామిలీను నడిపించడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటాడు హీరో. కోపంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత వేరే అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా. శ్రీనివాస్ వెలిగొండ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సంజీవ్ రెడ్డి నిర్మించారు.
ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సన్నీ బాగా ఎమోషనల్ అయ్యాడు. తన దోస్తులందరికీ తనను హీరోగా చూడాలని కోరిక ఉండేదని.. ఆ కలను ఈ సినిమాతో నిజం చేశానని చెప్పుకొచ్చాడు సన్నీ.
#SakalaGunabhiRamaTrailer Out Now!
— VJ Sunny (@VJSunnyOfficial) February 5, 2022
Here is the link https://t.co/mW2bOCwRlH
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)