అన్వేషించండి

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Bootcut Balaraju Teaser: సోహెల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘బూట్ కట్ బాలరాజు‘. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. సోహెల్ బ్యాచ్ చేసే చిల్లర పనులు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

Bootcut Balaraju Teaser: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. చక్కటి ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.   

‘బూట్ కట్ బాలరాజు‘గా సోహెల్

తాజాగా సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమాలో నటిస్తున్నారు. కోనేటి శ్రీను దర్శకత్వం ఈ సినిమా రూపొందుతోంది. మేఘ లేఖ హీరోయిన్ గా నటిస్తోంది. ఎండీ పాషా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఇంద్ర‌జ‌, సునీల్, సిరి హన్మంతు, జ‌బ‌ర్ద‌స్త్ రోహిణి, ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో అలరిస్తోంది. హీరో సోహెల్, ఆయన గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా లేదు. ఊళ్లో జనాలు వీళ్ల తిక్క చేష్టలకు తిట్టిన వాళ్లే గానీ, తిట్టని వాళ్లు లేరు. “అనగనగా ఒక రాజు అనేది పాతకథ. అయితే, అనగనగా ఒక ‘బూట్ కట్ బాలరాజు’ అనేది కొత్తకథ. నా కథ అంటూ హీరోయిన్ వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. హీరో సోహెల్ సిగ్గు శరం లాంటి పట్టింపులు ఏమీ లేకుండా తన గాలి బ్యాచ్ తో కలిసి ఊరు మీద పడి తిరుగుతుంటాడు. తుంటరి పనులు చేస్తుంటారు. మంచి వాళ్లంతా పోతున్నరు.. మీరు పోతలేరేంట్రా? అని ఊరు జనాలు అనే రేంజిలో వాళ్ల చిల్లర చేష్టలు ఉంటాయి.

కాలేజీకి వెళ్లరు. వెళ్లినా చదవరు. పనులు చేతగావు. తినడంలో మాత్రం ముందుంటారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా సింపుల్ గా తుడిచేసుకుని బతికే బతుకు హీరో బ్యాచ్ ది. సీనియర్ నటి ఇంద్రజ ఇంద్రావతి పటేలమ్మాగా కనిపిస్తుంది. హీరోయిన్ మేఘ లేఖను చాలా అందంగా చూపించారు. తెలంగాణ యాసలో ఆమె చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక అమ్మాయిల గురించి సద్దాం వేసే పంచ్ పటాసులా పేలుతుంది. ‘నా ప్రాణం పోతుంది అంటే, ఆగాగు స్నానం చేసి రెడీ అయి వస్తా అనే టైప్’ అంటూ సైటర్లు విసురుతాడు. ముక్కు అవినాష్ బాలయ్యను ఇమిటేట్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫుల్ ఫన్నీగా కొనసాగే ఈ టీజర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.   

ఇప్పటికే ఈ సినిమా గురించి సోహెల్ పలు విషయాలు వెల్లడించారు. సుమారు తొమ్మిది నెల‌లు ఈ మూవీ స్క్రిప్ట్ కోసం కష్టపడినట్లు చెప్పారు. మంచి స్క్రిప్ట్, చక్కటి డైలాగ్స్ ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకుంటాయన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందన్నారు. ఈ చిత్రానికి   శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 

Read Also: మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్‌ ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Gundeninda Gudigantalu July10th Episode:మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు: మనోజ్ తిక్క కుదిర్చేందుకు బాలు చేసిన పనేంటి...? గుడ్డివాడిగా ఇంట్లో తిప్పలు పడుతున్న మనోజ్‌
Brahmamudi Serial Today July 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు – లక్కీని ఓదార్చిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన నందు – లక్కీని ఓదార్చిన రాజు  
Nindu Manasulu Serial Today July 10th: నిండు మనసులు: ఇందిర బతకడం కష్టమేనా! గణని రాజశేఖరం ఎందుకు బతిమాలాడు!
నిండు మనసులు: ఇందిర బతకడం కష్టమేనా! గణని రాజశేఖరం ఎందుకు బతిమాలాడు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget