అన్వేషించండి

Balakrishna New Movie: బాలకృష్ణ సినిమాలో అల్లు శిరీష్‌కు ఛాన్స్?

ఇటీవలే అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్, బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది.

నందమూరి బాలకృష్ణ ఈ పేరు గురించి ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్లు ఒకలా, ఆయన్ను దూరం నుంచి చూసిన వాళ్ళు ఇంకోలా చెప్తుంటారు. ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కొద్దిమందిలో బాలకృష్ణ ఒకరు. అందుకే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. గతేడాది 'అఖండ' సినిమాతో మాస్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమాలతో పాటు డిజిటల్ తెరపై కూడా బాలయ్య తన మార్క్ చూపిస్తున్నారు. 'ఆహా' ఓటీటీలో ప్రసారమౌతోన్న 'అన్ స్టాపబుల్' ప్రోగ్రాంతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు బాలయ్య. 

ఇటీవలే అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్, బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. అల్లు శిరీష్ బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడిగాడు. దానికి బాలయ్య సమాధానాలు చెప్తూనే కౌంటర్ లు ఇచ్చారు. దీంతో సభా ప్రాంగణం అంతా నవ్వులు విరిశాయి. తర్వాత అల్లు శిరీష్ బాలయ్య సినిమాలో తనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలని, అది కూడా తన్నులు తినే క్యారెక్టర్ కాకుండా మీతో డైలాగ్ చెప్పే క్యారెక్టర్ ఇవ్వాలని అడగడంతో దానికి వెంటనే బాలయ్య ఓకే అన్నట్టు సైగ చేశారు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. తర్వాత బాలయ్య పరసురామ్ ను పిలిచి ‘‘శిరీష్ కు ఓ క్యారెక్టర్ ఇవ్వవయ్యా. నేను అతన్ని మార్చేదో, అతను నన్ను మార్చేదో ఏదోటి ఇవ్వు‘‘ అని చెప్పడంతో ప్రాంగణంలో నవ్వులు పూశాయి.

ఈ సంభాషణ విన్న తరువాత అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. పరశురామ్ చెప్పే కథ బాలకృష్ణ కు నచ్చితే వెంటనే సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ కాంబో ఓకే అయితే అందులో అల్లు శిరీష్ కూడా ఓ క్యారెక్టర్ చేయడం పక్కా అని తెలుస్తోంది. ఫైనల్ గా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో పరశురాం దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో అల్లు శిరీష్, నందమూరి బాలకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఊహించేసుకుంటున్నారు అల్లు, నందమూరి ఫ్యాన్స్. 

వాస్తవానికి నందమూరి, అల్లు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎన్టీ రామారావు టైమ్ నుంచే నందమూరి అల్లు ఫ్యామిలీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వారి ఇరువురి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉండేవట. వారి పిల్లలు కూడా కలిసి ఆడుకునేవారట. ఎన్టీఆర్ ఫ్యామిలితో  అల్లు రామలింగయ్యకు ఉన్న చనువు మరెవ్వరికి ఉండేది కాదట. ఈ విషయాలన్నీ బాలయ్య ఇటీవలే ఓ కార్యక్రమంలో చెప్పారు. అందుకే అల్లు అరవింద్ అడగగానే బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి వెంటనే ఒప్పుకున్నారు. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అందుకే వెంటనే 'అన్ స్టాపబుల్ 2'ను రెడీ చేశారు అల్లు అరవింద్. ఈ టాక్ షో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది కాకుండా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో త్వరలో బాలయ్య ఓ సినిమా కూడా చేయనున్నట్లు తెలియడంతో వీరి స్నేహానుబంధం మరోసారి తేటతెల్లమైంది. ప్రస్తుతం బాలయ్య 'వీర సింహ రెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...

టాప్ హెడ్ లైన్స్

The Odyssey Review - 'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?
'ది ఒడిస్సీ' రివ్యూ: క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఎలా ఉందంటే?
Jagadhatri Serial Today JULY 16th:కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టడానికి వచ్చిన అత్త....ఆదిలక్ష్మీని అడ్డుపెట్టుకుని ఆడుకోవాలనుకుంటున్న వైజయంతి
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Shivlok Ke Kundakka Mandakka: జీ5 కిడ్స్ యూనివర్స్‌లో 'శివలోక్ కె కుండక్క మండక్క'... యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీ5 కిడ్స్ యూనివర్స్‌లో 'శివలోక్ కె కుండక్క మండక్క'... యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Embed widget