SKN Father Passed Away: ‘బేబీ’ నిర్మాత ఎస్‌కేఎన్ తండ్రి కన్నుమూత - ఇండస్ట్రీలో విషాదం!
SKN Father: ‘బేబి’ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు అనారోగ్యంతో మరణించారు.
Producer SKN: టాలీవుడ్‌లో ‘బేబీ’ సినిమాతో ఎస్‌కేఎన్ మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఇంట విషాదం నెలకొంది. ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్య ప్రకాశరావు గురువారం అనారోగ్యోంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అనంతరం పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్‌ను పరామర్శించారు.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నివాళులు అర్పించారు. సూర్య ప్రకాశరావుకు నివాళులు అర్పిస్తూ ఎన్‌కేఎన్‌కు, వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్‌కేఎన్ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలువురు హీరోలకు పీఆర్వోగా పని చేశారు. అనంతరం కొన్ని సినిమాలకు డిస్ట్రీబ్యూటర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు.
శ్రీ గాదె సూర్యప్రకాశ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/QfkdWpXnrD
— JanaSena Party (@JanaSenaParty) January 4, 2024
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’, సుహాస్ ‘కలర్ ఫోటో’, సాయి ధరమ్ తేజ్ ‘ప్రతి రోజూ పండగే’, ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాలను ఎస్‌కేన్ నిర్మించారు. 2023లో వచ్చిన ‘బేబీ’ ఎస్‌కేఎన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇప్పుడు ఆయన మరిన్ని సినిమాలు నిర్మిస్తున్నారు.