By: ABP Desam | Updated at : 16 Apr 2023 11:51 AM (IST)
Photo@Ayan Mukerji/Instagram
బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ధర్మ ప్రొడక్షన్స్ నుంచి బయకు వచ్చిన ఆయనకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, పాన్ ఇండియన్ స్టార్ జూ. ఎన్టీఆర్ తో కలిసి ‘వార్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘వార్ 2’ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న అయాన్
ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారం తీసుకుంటున్నారు అయాన్ ముఖర్జీ. ‘వార్‘ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అయాన్ ముఖర్జీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ‘వార్ 2’కు దర్శకత్వం వహించినందుకు గాను ఏకంగా రూ. 32 కోట్లు అందుకోనున్నారట. 2024 చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ తర్వాత YRF స్పై యూనివర్స్ లో ఆరవ చిత్రంగా ‘వార్ 2’ రూపొందుతోంది. అంతేకాదు, ‘వార్ 2’ కోసం రూ. 32 కోట్లు వసూళు చేసిన అయాన్ ముఖర్జీ, YRF క్యాంప్ లో సిద్ధార్థ్ ఆనంద్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో ఒకరిగా నిలిచారు.
‘వార్ 2’ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. 'వార్' సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'వార్ 2'లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాయ, 'KGF’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
Read Also:‘బాహుబలి‘ రేంజిలో తెరకెక్కుతున్న సూర్య లేటెస్ట్ మూవీ, టైటిల్ ఫిక్స్, విడుదల ఎప్పుడంటే?
Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్
HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?
Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
అఖిల్కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్కూ మింగుడు పడని ఆ నిర్ణయం!
Gruhalakshmi May 29th: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!