అన్వేషించండి

RRR: 'ఆర్ఆర్ఆర్'కు మరో సమస్య, ధర్నా చేస్తామంటూ ఏపీ నాయకుల హెచ్చరికలు 

'ఆర్ఆర్ఆర్' సినిమాతో పోరాట వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఏపీ సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ గనుక లేకుంటే జనవరి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మార్చి 25న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

చరిత్రలో కలవని ఇద్దరు యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలుసుకొని.. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఎన్ని సార్లు చెప్పినప్పటికీ.. ఆ పాయింట్ నే పట్టుకొని వివాదాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ కొందరు కోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు ఈ సినిమాకి మరో సమస్య వచ్చింది. 

'ఆర్ఆర్ఆర్' సినిమాతో పోరాట వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఏపీ సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నిస్వార్ధంగా పోరాడిన వీరులను రాజమౌళి డబ్బుల కోసం వాడుకుంటున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారి దగ్గర పోలీస్ ఆఫీసర్ గా పనిచేసినట్లు, అమ్మాయితో డాన్స్ చేసినట్లు చూపించారని మండిపడ్డారు. 

ముందుగా చరిత్రకారులకు, భీమ్, అల్లూరి కుటుంబసభ్యులకు సినిమా చూపించి అసభ్యకరమైన సన్నివేశాలను తొలగించాలని చెప్పారు. సినిమాను సినిమాగానే చూడాలన్నప్పుడు.. దేశం కోసం ప్రాణాలను వదిలిన అమర వీరుల పేర్లను వాడుకోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని.. హైద‌రాబాద్‌, ఢిల్లీలోని సెంట్ర‌ల్ సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర దీక్ష‌లు చేప‌డ‌తామని అన్నారు. మరి దీనిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!

ఇక డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
Divija Prabhakar: ‌హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget