Balakrishna: బాలయ్య సినీ ప్రయాణానికి 50 ఏళ్లు - అన్ స్టాపబుల్‌గా సాగాలని సీఎం చంద్రబాబు విషెష్
Andhra News: నట సింహం నందమూరి బాలకృష్ణ శుక్రవారంతో 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు విషెష్ చెప్పారు. ఎన్నో రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.
CM Chandrababu Wishes To Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినీ ప్రయాణం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 'తాతమ్మ కల' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ తనయుడిగా నటనతో మెప్పించి అలరించారు. 'బాలయ్య' అంటేనే అభిమానులకు ఫుల్ జోష్. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తేనే ఓ కొత్త ఊపు వస్తుంది. 'జై బాలయ్య' అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ సందడి చేస్తుంటారు. జానపదం, పౌరాణిక, మాస్, క్లాస్ ఇలా అన్ని చిత్రాలతోనూ ఆయన మెప్పించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయన వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్పారు.
'అన్‌స్టాపబుల్‌గా సాగాలి'
ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య...ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ, నేటి తరాన్ని కూడా… pic.twitter.com/kTBRYn1kFe
— N Chandrababu Naidu (@ncbn) August 30, 2024
'ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలయ్య...ఇప్పటికీ అగ్ర హీరోగా రాణిస్తూ, నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జోనర్లలో నటించి తానేంటో చాటిచెప్పారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించి, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్‌గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.' అంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
స్వర్ణోత్సవ వేడుకలు
అటు, బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తైన సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో సెప్టెంబర్ 1న (ఆదివారం) స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రత్యేక ఇన్విటేషన్ కార్డు
కాగా, నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఓ ప్రత్యేక ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన సినీ ప్రస్థానం వివరాలను ఈ కార్డులో పొందుపరిచారు. 1974 నుంచి 2024 వరకూ బాలయ్య తన కెరీర్‌లో 109 సినిమాలు చేసినట్లు తెలిపారు. ఆయన సినిమాలు రూ.10 లక్షల నుంచి రూ.250 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టాయని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయనకు.. ఫ్యాన్స్ 10 ఫీట్ల నుంచి 108 ఫీట్ల కటౌట్స్ పెట్టారని అన్నారు. అలాగే, ఆయన సినిమాలు 100 నుంచి 1000 రోజులు అడిన రికార్డు క్రియేట్ చేశాయని.. అటు సినిమాల్లోనూ, ఇటు పాలిటిక్స్‌లోనూ రాణించారని ఇన్విటేషన్‌లో పేర్కొన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారని వివరించారు.
Also Read: Pawan Kalyan: 'ఆ మొక్కలు పెంచొద్దు' - వన మహోత్సవంలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు