Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన అనుపమ్ ఖేర్ ఇటీవల 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ హీరో ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగ్ లో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తోన్న ఈ సినిమాలో దిగ్గజ నటీనటులను తీసుకుంటున్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషలకు చెందిన స్టార్స్ ను కూడా ఆన్ బోర్డ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ని ఈ సినిమాలో కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు.
ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన అనుపమ్ ఖేర్ ఇటీవల 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అలాంటి నటుడును 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో ఎంపిక చేసుకోవడం విశేషం. మరి సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!
అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్ మదీ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!
Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















