Mowgli First Look: ‘మోగ్లీ‘గా వస్తున్న సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల - ఫస్ట్ లుక్‌తో ఇంప్రెస్ చేసిన సందీప్ రాజ్
రోషన్ కనకాల రెండో సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీ 2025 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Roshan Kanakala's Mowgli 1st Look: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా, చక్కటి నటనతో యాక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఆయన రెండో సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ‘కలర్ ఫోటో’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
ఆకట్టుకుంటున్న టైటిల్, ఫస్ట్ లుక్
రోషన్ కనకాల రెండో సినిమాకు ‘మోగ్లీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నది. దట్టమైన అడవిలో గుర్రంతో కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో చక్కటి చిరునవ్వుతో కూల్ గా, అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ‘మోగ్లీ’ అనేది ‘జంగిల్ బుక్’లో ఫేమస్ క్యారెక్టర్. రోషన్ సినిమా కూడా అటవీ నేపథ్యంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరో పాత్ర పేరు మురళీ అలియాస్ ‘మోగ్లీ’. హీరోని డిఫరెంట్‌గా చూపించడంలో నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ సక్సెస్ అయ్యారు.
2025 సమ్మర్ లో ‘మోగ్లీ’ విడుదల
రోషన్ రెండో సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తొలి సినిమా(కలర్ ఫోటో)తోనే జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా ‘కలర్ ఫోటో’ తరహా కథాంశంతోనే తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక జరుగుతున్నది. ఈ చిత్రంలో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, విలన్ పాత్రకు సైతం అంతే ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’, ‘RRR’ లాంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన రామ మారుతి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ‘కలర్ ఫోటో’, ‘మేజర్’,’గూఢచారి 2’ లాంటి చిత్రాలకు ఎడిటర్ గా వ్యవహరించిన పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి ఎడిటర్ బాధ్యతలు చేపడుతున్నారు.
యాంకర్ సుమ రియాక్షన్ ఏంటంటే?
కొడుకు రోషన్ ‘మోగ్లీ’ మూవీ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాజీవ్ కనకాల.. రోషన్‌ను చిన్నప్పుడు ‘మోగ్లీ’ అని పిలిచేవాడు. ఇప్పుడు అదే పేరుతో అతడు సినిమా చేయడం మ్యాజిక్ గా ఉంది” అని వెల్లడించారు.
View this post on Instagram
Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?