Amigos Movie Update : హే 'అమిగోస్', కళ్యాణ్ రామ్‌లో షేడ్స్ చూశారా? త్వరలో వేటూరి పాట
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. ఆల్రెడీ రెండు లుక్స్ విడుదల చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే కథానాయకులలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకరు. ఆయన కంటూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. లుక్స్ పరంగా కూడా ప్రయోగాలు చేస్తుంటారు. 'బింబిసార' సినిమాతో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఆయన... ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూహించే పదం. దాన్ని టైటిల్‌గా పెట్టటం వెనుక ఉన్న కారణం ఏంటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులు అందరిలో ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... సినిమాలో హీరో లుక్స్ రెండు విడుదల చేశారు.
రెండు లుక్స్ చూశారా?
త్వరలో వేటూరి పాట!!
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ రెండు లుక్స్ విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్‌గా, ఎంట్రప్రెన్యూర్ సిద్ధార్థ్‌గా.. లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ చూపించారు. త్వరలో పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. దివంగత గేయ రచయిత వేటూరి రాసిన పాట సినిమాలో ఉందని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.
Also Read : గోల్డెన్ గ్లోబ్‌కు రామ్ చరణ్, ఎన్టీఆర్ - ప్రెస్టీజియస్ అవార్డుల్లో సందడి చేయనున్న RRR టీమ్!
The Audio of #Amigos on @saregamasouth 💥
— Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2023
A blockbuster album loading beginning with a classic from the pen of Late Sri Veturi Garu ❤️
In cinemas on Feb 10, 2023 🔥@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial https://t.co/5SURmBUxmR
కళ్యాణ్ రామ్ జంటగా కన్నడ భామ!
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కళ్యాణ్ రామ్
'అమిగోస్'లో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారనే విషయాన్ని పోస్టర్ ద్వారా దర్శక నిర్మాతలు రివీల్ చేశారు. హీరోగా కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రీసెంట్‌గా విడుదలైన కళ్యాణ్ రామ్ లుక్, టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
Also Read : ఫిబ్రవరిలో పాన్ ఇండియా సినిమాతో థియేటర్లలో సందీప్ కిషన్ బోణీ
View this post on Instagram
ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు!
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
'అమిగోస్' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, నృత్యాలు : శోభి, ఫైట్ మాస్టర్స్: వెంకట్, రామ్ కిషన్, పాటలు: 'స్వర్గీయ' శ్రీ వేటూరి, రామజోగయ్య శాస్త్రి, రెహమాన్, ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్, సి.ఇ.ఓ : చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హరి తుమ్మల, సంగీతం : జిబ్రాన్,
View this post on Instagram