అన్వేషించండి

Ram Pothineni: అల్లు అర్జున్ స్టోరీతో రామ్ సినిమా - బోయపాటి మాస్ ప్లాన్!

అల్లు అర్జున్ కోసం అనుకున్న కథను ఇప్పుడు రామ్ పోతినేనితో తీస్తున్నారట బోయపాటి. 

యంగ్ హీరో రామ్ చివరిగా 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ 20వ చిత్రమిది (RAPO20). ఇందులో రామ్ కి జంటగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.

ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథను ముందుగా బన్నీకి వినిపించారట దర్శకుడు బోయపాటి. 
 
అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్న బోయపాటి ఈ కథనే వినిపించారట. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ తరువాత 'సరైనోడు' కథ చెప్పారట. బన్నీకి 'సరైనోడు' నచ్చడంతో దానికే ఓటేశారు. దీంతో బోయపాటి మొదట రాసుకున్న కథ అలా పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే కథను రామ్ కి చెప్పి మెప్పించినట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇలా ఒక హీరో కోసం అనుకున్న కథతో మరో హీరో సినిమా చేయడం కామన్. ఇప్పుడు బన్నీ కోసం అనుకున్న కథతో రామ్ సినిమా చేస్తున్నారంతే. అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ: 
ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా. ఇప్పటికే ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అలానే ఐటెం సాంగ్స్ లో కూడా కనిపించింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు బోయపాటి-రామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. రామ్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి. 

సంగీత దర్శకుడిగా తమన్:
ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ (S Thaman) సంగీతం అందించనున్నారు. 'అఖండ' చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ విజయం తర్వాత మరోసారి తమన్, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు డిమాండ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. ఊర మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి చిత్రాలు తెరకెక్కించడంలో తన శైలి ఏంటనేది బోయపాటి శ్రీను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్.
 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 8th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Crime Thriller OTT : వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget