Allu Arjun: అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ - స్నేహారెడ్డి ఆన్సర్ ఇదే!
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇప్పుడు 'పుష్ప' సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతుంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బ్రేక్ లో ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతున్నారు. త్వరలోనే 'పుష్ప2' షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తుండడంతో షూటింగ్ ఆలస్యమవుతుందని టాక్.
త్వరలోనే షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ రానుంది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. ట్రిప్ లకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అల్లు ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఈమె అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లో ముచ్చటించింది.
ఈ క్రమంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. తన ఫేవరెట్ కలర్ రెడ్ అని.. తన ఫేవరెట్ హాలిడే స్పాట్ లండన్ అని చెప్పింది. అల్లు అయాన్, అర్హలలో ఎవరు నాటీ అని ప్రశ్నించగా.. అయాన్ అని బదులిచ్చింది. అలానే తన ఫ్యామిలీ ఫొటోలను కొన్ని షేర్ చేసింది. ఓ అభిమాని అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ ఏంటని అడగ్గా.. బిరియాని అని జవాబిచ్చింది స్నేహా.
Also Read: 'హరిహర వీరమల్లు' - ఏ పండక్కి వస్తుందో?
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















