News
News
X

Allu Arha: డబ్బింగ్ చెప్తున్న అల్లు అర్జున్ ముద్దుల కూతురు, ఏ సినిమా కోసమో తెలుసా?

అల్లు అర్జున్-స్నేహారెడ్డి ముద్దుల కూతురు అర్హ డబ్బింగ్ చెప్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘శాకుంతలం‘ సినిమా కోసం ఆమె డబ్బింగ్ చెప్పిందట.

FOLLOW US: 
Share:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ గురించి సోషల్ మీడియాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అమ్మానాన్నలతో కలిసి ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తూ అందరినీ నవ్విస్తుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నారి ‘శాకుంతలం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది.  

‘శాకుంతలం’ సినిమాలో భరతుడి పాత్ర పోషిస్తున్న అర్హ

ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో అల్లు అర్హ కనిపించింది. సింహంపై స్వారీ చేస్తున్న భరత యువరాజుగా కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం అర్హ స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తీసిన ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో పోస్టు చేడయంతో ఫ్యాన్స్ బాగా ఖుషీ అవుతున్నారు. అల్లు అర్జున్ కూతురు ‘శాకుంతలం‘ సినిమాలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టింది అర్హ. తండ్రితో కలిసి ఈమె చేసే అల్లరి మామూలుగా ఉండదు.

మహేష్ బాబు సినిమాలోనూ నటిస్తున్న అల్లు అర్హ   

‘శాకుంతలం’ సినిమాను గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అటు  మహేశ్ బాబు మూవీ SSMB28లో కూడా అల్లు అర్హ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆరేళ్ల వయస్సులోనే మూవీస్‌లో బిజీ అవుతోంది అల్లు అర్జున్ ముద్దుల కూతురు.

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

Read Also: దారికొచ్చిన రష్మిక? రిషబ్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్!

ట్రైలర్ ఎలా ఉందంటే..: ఈ భూమి మీద అమ్మ నాన్నలు అక్కర్లేని తొలి బిడ్డ, మేనక, విశ్వమిత్రుల ప్రేమకు గుర్తు ఈ బిడ్డ. అప్సర బిడ్డైనా అనాథలా మిగిలిందే అంటూ శాకుంతల పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత దుష్యండితో ప్రేమ.. అనంతరం రాజప్రాసదంలో గర్భవతిగా ఉన్న శాకుంతలకు అవమానం.. ఆ తర్వాతి పరిణమాలు, యుద్ధాలు.. తదితర ఆసక్తికర సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. ఇందులో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు ఒదిగిపోయారు. ఈ విజువల్స్ కొన్ని యుగాలు వెనక్కి తీసుకెళ్తుంది. మరోసారి ‘బాహుబలి’ మూవీని గుర్తుచేస్తుంది. విజువల్స్ క్వాలిటీ విషయంలో ‘బాహుబలి’తో పోల్చలేం. కానీ, సినిమాకు తగినట్లుగానే వీఎఫ్ఎక్స్‌ను మలిచారు. చెప్పాలంటే.. ఇది మరో విజువల్ వండర్‌గా నిలిచిపోనుంది. అలాగే యుద్ధ సన్నివేశాలు కూడా ఆకట్టుకొనేలాగే ఉన్నాయి. ట్రైలర్ చివర్లో ‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చివర్లో సింహంపై కూర్చున్న చిన్నారి మరెవ్వరో కాదు.. అల్లు అర్జున్ కుమార్తె అర్హ. మొత్తానికి ‘శాంకుతలం’ ట్రైలర్‌ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలాగే ఉంది. అయితే, మూవీ ఆకట్టుకుటుందా లేదా అనేది రిలీజ్ తర్వాతే చెప్పగలం. 

Published at : 19 Jan 2023 12:09 PM (IST) Tags: Samantha Ruth Prabhu Shaakuntalam Movie Allu Arjun daughter Allu Arha dubbing

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్

BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

BRS Nanded Meeting :  నాందేడ్‌లో  బీఆర్ఎస్  బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ

Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?