అన్వేషించండి

Allu Arjun Pushpa 2: ‘పుష్ప 2’ షూటింగ్ 50 శాతమే పూర్తయ్యిందా? ఎందుకు ఇంత లేట్ అవుతోంది?

‘పుష్ప’ మూవీ పాన్ ఇండియా రేంజిలో హిట్ కావడంతో, ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా, షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో దుమ్మురేపిన చిత్రం 'పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజైన ఈ సినిమా, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టించింది. సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని డైలాగులు, పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తొలి భాగం దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి 'పార్ట్ 2' పైనే పడింది. ఈ సినిమాపైనా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగాయి.

నత్తన నడకన సాగుతున్న ‘పుష్ప 2’ షూటింగ్

‘పుష్ప 2’ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట దర్శకుడు సుకుమార్. సినిమాలోని ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కేవలం 50 శాతమే పూర్తియ్యిందట. ఏమాత్రం తొందర పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారట. మిగిలిన షూటింగ్ 2024 తొలి రెండు నెలల్లో కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట.        

ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాకు సంబంధించిన పలు స్టిల్స్, వీడియోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముమ్ముందు సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప 2'లో ఆయన లుక్ విడుదల చేశారు. అది నెట్టింట వైరల్ అయ్యింది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది. 

సంచలన విజయాన్ని అందుకున్న ‘పుష్ప’

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ పలు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫజిల్ కీలక పాత్రలో న‌టించిన ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్, పాటలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. సినీ సెల‌బ్రెటీల నుంచి పలువురు క్రికెట‌ర్స్‌, రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు..   ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాలోని డైలాగ్స్‌, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌ గా చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయ్యారు. ‘పుష్ప 2’ సినిమా వచ్చే ఏడాది(2024) వేసవికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read Also: రౌడీ హీరో దూకుడు- ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May12th: మ్యాడీ గెటప్‌లో అదరగొట్టిన సూర్యనారాయణ, ఇందిరగా జీవించేసిన శ్రీలక్ష్మీ
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: మ్యాడీ గెటప్‌లో అదరగొట్టిన సూర్యనారాయణ, ఇందిరగా జీవించేసిన శ్రీలక్ష్మీ
Jagadhatri Serial Today May 12th: జగద్ధాత్రి సీరియల్: జేడీ,కేడీని చంపేందుకు అవినాష్‌ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? కార్తిక్‌ను కేడీ ఎలా చంపాడు?
జగద్ధాత్రి సీరియల్: జేడీ,కేడీని చంపేందుకు అవినాష్‌ వేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? కార్తిక్‌ను కేడీ ఎలా చంపాడు?
Mouni Roy Divorce: డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
డబ్బు వాడుకున్నాడు... మోసం చేశాడు... మౌనీ రాయ్ విడాకుల వెనుక కారణాలు అవేనా?
Actor Ali: అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ
అలీ విశ్వరూపం... చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో కొత్త మూవీ షురూ

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget