Alia Bhatt In Japanese Film: జపనీస్ మూవీలో అలియా భట్ - త్వరలోనే అప్‌డేట్
ఇటీవల అలియా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
![Alia Bhatt In Japanese Film: జపనీస్ మూవీలో అలియా భట్ - త్వరలోనే అప్డేట్ Alia Bhatt to Star in Japanese Film After Hollywood Debut, check details Alia Bhatt In Japanese Film: జపనీస్ మూవీలో అలియా భట్ - త్వరలోనే అప్డేట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/2d56109842c39e823c9ca5ff50b4514b1669361606850592_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలీవుడ్ నటి అలియా భట్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అలియా భట్ కు కేవలం ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. అంతేకాదు, విదేశాల్లో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అలియా. తర్వాత పలు సినిమాల్లోనూ నటించనుంది. కెరీర్ మొదట్నుంచీ తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే అలియా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలో ఆమె జపాన్ భాషలో సినిమా చేయనున్నానని తెలిపింది.
ఇప్పటికే అలియా బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలుగులోనూ ఆమె ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాతో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతోంది అలియా.
ఇటీవల అలియా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం ఒక్క బాలీవుడ్ లోనే కాదని, విదేశీ భాషల్లో కూడా నటించాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది అలియా. ఈ సందర్భంగా జపాన్ సినీ పరిశ్రమలో ఎంట్రీ గురించి కూడా హింట్ ఇచ్చింది. తాను ఏ సినిమాలో నటించినా.. తనని తాను ఇంప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటానని తెలిపింది. ఛాలెంజింగ్ తో కూడిన పాత్రలు చేయడం తనకు ఇష్టమని చెప్పింది. అందుకే ఎప్పుడూ కొత్త తరహా పాత్రలు చేయడానికి, కొత్త పరిశ్రమలో పనిచేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొంది. ఎలా మాట్లాడాలో తెలిస్తే.. జపనీస్ సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ప్రస్తుతం అలియా భట్ త్వరలో కరణ్ జోహార్ దర్శకత్వంలో 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ అలియాతో రొమాన్స్ చేయనుంది. ఇక ఈ కొత్తమూవీలో అలియా రణ్ బీర్ తో పాటు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల అలియా రణ్ బీర్ కపూర్ తో కలసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటించింది. ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది 'బ్రహ్మస్త్ర'. మరో వైపు హాలీవుడ్ లో అలియా నటించిన 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమా కూడా వచ్చే ఏడాది 2023 లో విడుదల కానుంది.
Also Read : లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)