అన్వేషించండి

VNBK Pre Release : కిరణ్ అబ్బవరం కోసం ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

Vinaro Bhagyamu Vishnu Katha Pre Release : కిరణ్ అబ్బవరం హీరోగా జీఏ 2 పిక్చర్స్ నిర్మించిన వినరో భాగ్యము విష్ణుకథ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా రానున్నారు.

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). 'బన్నీ' వాస్ నిర్మించారు. క‌శ్మీర ప‌ర్ధేశీ కథానాయికగా నటించారు. ఈ శనివారం (ఫిబ్రవరి 18న) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కంటే ముందు ప్రీ రిలీజ్ వేడుక చేయడానికి ఏర్పాట్లు చేశారు. 

అఖిల్ అక్కినేని అతిథిగా... 
'వినరో భాగ్యము విష్ణు కథ' ప్రీ రిలీజ్ వేడుకకు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ విషయాన్నీ జీఏ2 పిక్చర్స్ అనౌన్స్ చేసింది. అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి విజయాన్ని ఆ సంస్థ అందించింది. అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకోసం వస్తున్నారు. 

అన్నమాచార్య వారసులకు సత్కారం!
తిరుపతి నేపథ్యంలో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా కథ జరుగుతుంది. ఈ మధ్య 'సోల్ ఆఫ్ తిరుపతి' పేరుతో సినిమాలో నాలుగో పాట విడుదల చేశారు. ఏడు కొండల వేంకటేశ్వరునికి అపర భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం కుటుంబ సభ్యుల చేత ఆ పాటను ఆవిష్కరింపజేశారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geetha Arts (@geethaarts)

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  
'వినరో భాగ్యము విష్ణు కథ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మంచి సినిమా తీశారని సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాతలను ప్రశంసించారని సమాచారం. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కూడా ప్రశంసలు అందుకుంది. నెంబర్ నైబర్ కాన్సెప్ట్ మీద సినిమా తీశారు.  

'వాసవ సుహాస...'తో పాజిటివ్ వైబ్స్!
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ 'వాసవ సుహాస'ను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమా టీజర్ సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో విడుదలకు ముందు సినిమా లాభాల్లోకి వెళ్ళిందని సమాచారం.

Also Read : 'అవెంజర్స్', 'యాంట్ మ్యాన్' విలన్ జోనాథన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే

జీఏ 2 పిక్చర్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం... ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో 'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదలకు కొన్ని రోజుల ముందే లాభాల్లోకి వెళ్ళిందని తెలిసింది. బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందట. జీఏ 2 పిక్చర్స్ సంస్థకు కొంత మంది రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేస్తారు. ఆల్రెడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్స్ & రైట్స్ ఫైనల్ చేశారు. డిజిటల్ & శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమ్మేశారు. వాటితో బడ్జెట్ మొత్తం రికవరీ కావడమే కాదు, లాభాలు వచ్చాయని తెలిసింది.

Also Read : నయన్ అంటే గౌరవమే - లేడీ సూపర్‌స్టార్ గొడవకు మాళవిక చెక్, ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆపేస్తారా?

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget