అన్వేషించండి

Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా - సంక్రాంతి డేట్ మిస్ చేయనుందా?

మొదట 'ఆదిపురుష్' సినిమాను 2023, జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మరో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి.

ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలు తారుమారయ్యేలా చేసింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు.

దిద్దుబాటు చర్యల్లో భాగంగా త్రీడీ టీజర్ ను మీడియాకు చూపించి నెగెటివిటీను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ.. జనాల్లో మాత్రం సినిమా మీద పూర్తి భరోసా అయితే లేదు. ఈ క్రమంలో వీలైనన్ని ఎక్కువ కరెక్షన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన జెన్యూన్ ఫీడ్ బ్యాక్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయడానికి చూస్తున్నారట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా చెప్పిన టైంకి రాకపోవచ్చని అంటున్నారు. 
 
Adipurush to Skip Sankranthi Slot: మొదట 'ఆదిపురుష్' సినిమాను 2023, జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మరో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. 'ఆదిపురుష్' కోసం నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు మిగిలిన సినిమాలతో థియేటర్లు షేర్ చేసుకుంటే అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోవచ్చు. అందుకే ఇప్పుడు సినిమాను పోస్ట్ పోన్ లేదా ప్రీ పోన్ చేయాలనుకుంటున్నారట. 
 
ఒక వారం ముందుకు లేదా రెండు వారాలు వెనక్కి సినిమా వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం దీనిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిర్ణయం తీసుకున్న వెంటనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమాలో రాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.
 
మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్':
కొన్నాళ్ల క్రితం రామాయణం ఆధారంగా తీసిన జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ చూశానని.. మన పురాణాల గురించి తెలియని ఎవరో అలాంటి సినిమా తీసినప్పుడు మనమెందుకు తీయకూడదనే ఆలోచనతో 'ఆదిపురుష్'ని తెరకెక్కించినట్లు చెప్పారు ఓం రౌత్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేటి జెనరేషన్ కి అర్ధమయ్యేలా తీయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రామాయణాన్ని చాలా కోణాల్లో తెలుసుకున్నానని.. అయితే ఈ జెనరేషన్ వారికి మార్వెల్స్, హ్యారీ పోటర్ వంటి సినిమాలు బాగా కనెక్ట్ అవుతుండడంతో.. అది దృష్టిలో పెట్టుకొని 'ఆదిపురుష్' తీసినట్లు చెప్పారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీయలేదని.. మోడర్న్ పెర్స్పెక్టివ్ లో సినిమా తీశానని అన్నారు.

హాలీవుడ్ లో 'ఆదిపురుష్':
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
 

టాప్ హెడ్ లైన్స్

Toxic Advance Booking: టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
Godavari Serial Today August 25th: 'గోదావరి' సీరియల్: సూర్య ముందే నందు, మురళీలను చంపాలని చూసిన సింహాద్రి! ఇల్లు అమ్మేస్తున్న నందు!
'గోదావరి' సీరియల్: సూర్య ముందే నందు, మురళీలను చంపాలని చూసిన సింహాద్రి! ఇల్లు అమ్మేస్తున్న నందు!
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
Gundeninda Gudigantalu August 25th:శివను కిడ్నాప్ చేసిన గుణ...బావమరిది కోసం బాలు వెతుకులాట
గుండెనిండా గుడిగంటలు:శివను కిడ్నాప్ చేసిన గుణ...బావమరిది కోసం బాలు వెతుకులాట

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
Dried Tulsi Plant Uses: ఎండిన తులసి కొమ్మలను పారేయకండి… ఇలా ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది!
ఎండిన తులసి కొమ్మలను పారేయకండి… ఇలా ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది!
Pratibha Thakkadpally: క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
Embed widget