అన్వేషించండి

Sunny Leone: సన్నీ లియోన్ పేరు వెనుక అంత కథ ఉందా - ఆ పేరు తన తల్లికి ఎందుకు నచ్చలేదు?

సన్నీ లియోన్.. ఈ పేరు వినని వాళ్లు ఉండకపోవచ్చు. పోర్న్ స్టార్ నుంచి ఫేవరేట్ హీరోయిన్ వరకూ ఆమె ప్రస్థానం సాగింది. అయితే సన్నీ లియోన్ పేరు వెనుక ఓ రహస్యం ఉందట. ఇటీవల సన్నీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..

Sunny Leone: సన్నీ లియోన్.. ఈ పేరు వినని వాళ్లు ఉండకపోవచ్చు. 2000 ల ప్రారంభంలో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. తర్వాత కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ యాక్టర్ గా మారిపోయింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సన్నీ లియోన్ అసలు పేరే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్రా. తర్వాత స్టేజీ నేమ్ గా సన్నీ లియోన్ అని మార్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ తన పేరు గురించి చెప్పుకొచ్చింది.

కరెన్‌జిత్ కౌర్ నుంచి సన్నీ లియోన్ గా..

సన్నీ లియోన్ కెనడాలో జన్మించింది. ఆమె అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్ర. అనుకోకుండా పోర్న్ స్టార్ గా మారిన సన్నీ 2011 లో బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత విపరీతమైన ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి సన్నీ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు వరుస నినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఫేవరేట్ నటీమణుల్లో సన్నీ లియోన్ ఒకరిగా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉందీ బోల్డ్ బ్యూటీ. ఇటీవల తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఒక  మ్యాగజైన్ సంస్థ వారు తనను ఇంటర్వ్యూ చేశారని చెప్పింది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్లు ‘‘మీ పేరు ఏమని వేయమంటారు’’ అని అడిగారని, అప్పుడు తనకు వెంటనే ఏమీ ఆలోచన రాలేదని అంది. అప్పుడు తాను వివిధ సంస్థల కోసం పనిచేస్తున్నానని, అప్పుడున్న పరిస్థితుల రీత్యా తన అసలు పేరును బయటపెట్టలేకపోయానని చెప్పింది. అందుకే తన మొదటి పేరుగా సన్నీ అని రాసుకోమని, చివరి పేరును మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోమని చెప్పానని తెలిపింది. తర్వాత ఆ మ్యాగజైన్ వాళ్లు తన పేరును సన్నీ లియోన్ గా ప్రచురించారని పేర్కొంది. 

ఆ పేరు మా అమ్మకు నచ్చలేదు: సన్నీ లియోన్

అయితే సన్నీ లియోన్ పేరు తన తల్లికి నచ్చేది కాదని చెప్పింది సన్నీ. అందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది. వాస్తవానికి సన్నీ అనేది తన సోదరుడి పేరు అని చెప్పింది. అతని పేరు సందీప్ సింగ్ అని, తాము ఇంట్లో అతన్ని సన్నీ అని ముద్దుగా పిలుస్తామని అంది. తన తమ్ముడి పేరునే తన స్టేజీ నేమ్ గా ఎంచుకోవడం పట్ల తన తల్లికి నచ్చేది కాదని చెప్పింది. ‘‘అన్ని పేర్లు ఉండగా నువ్వు ఈ పేరే పెట్టుకోవాలా’’ అని తన తల్లి ప్రశ్నించిందని కూడా చెప్పింది సన్నీ. కానీ అప్పుడది తన మనుసులోకి వచ్చిందని, తర్వాత ఆ ఇంటర్వ్యూ సంస్థ వాళ్లు మరో పేరును కలిపి సన్నీ లియోన్ అని వేశారని అంది. ఆ మ్యాగజైన్ స్టోరీ వేసినపుడు తన వయసు కేవలం 19 ఏళ్లు అని అప్పటి నుంచీ ఆ పేరును అలాగే ఉంచేశానని తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని చెప్పింది సన్నీ.

Also Read: వివాదంలో ‘హిరణ్యకశ్యప’ మూవీ - రానాపై గుణశేఖర్ గరం గరం, ఆ శాపనార్థాలు ఆయనకేనా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nainisha Rai: బ్రహ్మముడి టామ్‌బాయ్.. అప్పు అలియాస్ నైనిషా రాయ్.. స్టార్టింగ్ స్ట్రగుల్స్, రియల్ లైఫ్ కష్టాలు!
బ్రహ్మముడి టామ్‌బాయ్.. అప్పు అలియాస్ నైనిషా రాయ్.. స్టార్టింగ్ స్ట్రగుల్స్, రియల్ లైఫ్ కష్టాలు!
Godavari Serial Today August 24th: 'గోదావరి' సీరియల్: ఒక్కటైపోయిన సూర్య, జాను.. నిలదీసిన నిత్య! తల్లి దగ్గరే మురళీ దొంగతనం!
'గోదావరి' సీరియల్: ఒక్కటైపోయిన సూర్య, జాను.. నిలదీసిన నిత్య! తల్లి దగ్గరే మురళీ దొంగతనం!
Karthika Deepam 2 Serial Today August 24th: కార్తీకదీపం 2 సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్‌లు! దీప కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న! మాలిని ఇంట్లో సూరజ్‌ని చూసేసిన కార్తీక్!
కార్తీకదీపం 2 సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్‌లు! దీప కాళ్లు పట్టుకున్న జ్యోత్స్న! మాలిని ఇంట్లో సూరజ్‌ని చూసేసిన కార్తీక్!
Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Embed widget