అన్వేషించండి

Sriya Reddy : ఆయన అంత పెద్ద స్టార్ అని తెలియదు, పవన్ కళ్యాణ్ గురించి ‘సలార్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

Sriya Reddy : ‘సలార్’ బ్యూటీ శ్రియా రెడ్డి ప్రస్తుతం ‘ఓజీ’ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Sriya Reddy Interesting Comments on Pawan Kalyan: సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ వెండితెరపై అడుగు పెట్టిన నటి శ్రియా రెడ్డి ‘సలార్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె పోషించిన రాధా రమా పాత్ర ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. పృథ్విరాజ్ సోదరిగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటకు విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ‘సలార్’ మూవీతో పాటు తన తదుపరి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పవన్ గురించి పెద్దగా తెలియదు- శ్రియా

‘సలార్’ మూవీ తన కెరీర్ కు మాంచి బూస్టింగ్ ఇచ్చిందని శ్రియా వెల్లడించింది. సుమారు దశాబ్దం తర్వాత చేసిన ఈ సినిమా తనకు మర్చిపోలేని గుర్తింపు తెచ్చిందని చెప్పింది. ఇక తన తర్వాతి చిత్రం ‘ఓజీ’ గురించి ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తనకు కీలక పాత్ర ఉంటుందని చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది. “‘ఓజీ’ అద్భుతమైన చిత్రం. దర్శకుడు సుజీత్ డిఫరెంట్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పవన్ కల్యాణ్ గురించి తాను ఈ సినిమాలో నటించే వరకు పెద్దగా వినలేదు. ఆయన అంత పెద్ద స్టార్ అని కూడా తెలియదు. ‘ఓజీ’లో నటిస్తున్నాని తెలియడంతో ఎక్కడికి వెళ్లినా పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు. మీరు మా హీరోతో నటిస్తున్నారు కదా? అని అడుగుతున్నారు. ఆయనకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సెట్‌లో ఎప్పుడు కలిసినా చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన చాలా మంచి మనిషి. పవర్ స్టార్ తో కలిసి పని చేయడం హ్యాపీగా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగం కావడం గొప్పగా ఉంది. ఈ సినిమాలో నాది నెగెటివ్ రోల్. కానీ, నా క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులతో కలిసి తొలి రోజు సినిమా చూడాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.

గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ‘ఓజీ’

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై  ప్రముఖ నిర్మాత దానయ్య ‘ఓజీ’ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  ముంబై, జపాన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సలార్’ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా శుక్రవారం నాడు (డిసెంబర్ 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన రాధా రమా పాత్రను శ్రియా పోషించింది.  ‘సలార్‌’ విజయం తర్వాత తనకు బాలీవుడ్‌ తో పాటు పలు ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వస్తున్నాయని ఆమె వెల్లడించింది.  

Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget