Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
రీసెంట్ గా శృతిహాసన్ తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. మధ్యలో బ్రేకప్ కారణంగా కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు తిరిగి వరుస సినిమాలు సైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 'సలార్' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. అలానే బాలయ్య, చిరంజీవిలతో సినిమాలు ఒప్పుకుంది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పింది. మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా కూడా.. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. తనకు PCOS ఉందని చెప్పింది. ఆడవాళ్లలో ఈ సమస్య చాలా కామన్(పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రాకపోవడం, అలానే ఎక్కువ రోజులు పీరియడ్స్ అవుతూ ఉండడం).
హార్మోన్ బ్యాలెన్స్ తప్పడం వలన ఇలా జరుగుతుంటుందని.. అయితే వాటి గురించి బాధపడడం మానేసి, ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది శృతి. అయితే మీడియాలో మాత్రం శృతిహాసన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని.. ఆమె పరిస్థితి బాలేదని, హాస్పిటల్ లో జాయిన్ అయిందని రకరకాల వార్తలొచ్చాయి. దీంతో శృతిహాసన్ అభిమానులు కంగారు పడ్డారు.
ఫైనల్ గా ఈ విషయంపై రియాక్ట్ అయింది శృతిహాసన్. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ప్రస్తుతం తను చాలా బాగున్నానని, హైదరాబాద్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పింది. PCOS అనేది చాలా కామన్ అని, చాలా ఏళ్లుగా తనకు ఆ ఇష్యూ ఉందని.. దాన్ని పాజిటివ్ వేలో చెబితే.. మీడియాలో నెగెటివ్ గా రాశారని మండిపడింది. తను హాస్పిటల్ లో జాయిన్ కాలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Actress @shrutihaasan slashes out baseless rumours on her health issues and confirms that she is hale and healthy.
— Vamsi Kaka (@vamsikaka) July 5, 2022
Check out her video statement.#ShrutiHaasan pic.twitter.com/37VrCyY6XH
View this post on Instagram