Samantha: పడి లేస్తే వచ్చే కిక్కే వేరు - ట్విట్టర్ యూజర్‌కు సమంత ఘాటు రిప్లై!
మహిళలు కింద పడటానికే ఎదుగుతారని ఒక ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్‌కు సమంత ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ప్రముఖ హీరోయిన్ సమంత సోమవారం కాసేపు ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. తనను మెన్షన్ చేసిన అనేక ట్వీట్లపై సమంత స్పందించారు. ట్విట్టర్‌లో ట్రోల్స్‌తో పాటు అభిమానులకు రిప్లైలు ఇచ్చారు. స్త్రీలు ఎదిగేది "కింద పడటానికే" అని ఒకరు ట్వీట్ చేశారు. దానికి సమంత "పడి పైకి లేస్తే అది మరింత మధురంగా మారుతుంది మిత్రమా" అని గట్టిగా రిప్లై ఇచ్చారు.
ట్విట్టర్‌లో ఒక యూజర్ "క్రోమ్‌పేట్‌లోని వెట్రీ థియేటర్‌కి వెళ్లినప్పుడు అక్కడ అన్నీ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల బ్యానర్‌లు ఉండటం చూశాం. తమిళ సినిమా ఎంత దూరం వచ్చిందో! 10 సంవత్సరాల క్రితం ఇది ఊహించలేనిది." అని ట్వీట్ చేశారు.
నయనతార నటించిన కనెక్ట్ , ఐశ్వర్య రాజేష్ నటించిన డ్రైవర్ జమున, త్రిష నటించిన రాంగి, కోవై సరళ నటించిన ‘సెంబి’ పోస్టర్‌లతో కూడిన వెట్రి సినిమా హాల్ చిత్రాలను ఆ అభిమాని పోస్ట్ చేశాడు. దీనికి సమంత హార్ట్ షేప్డ్ ఎమోజీలతో స్పందిస్తూ "ఉమెన్ రైజింగ్!!" అని రిప్లై ఇచ్చింది ఈ ట్వీట్‌కి మరో యూజర్ "జస్ట్ టు ఫాల్" అని రిప్లై ఇచ్చాడు. అప్పుడు సమంత "పడి పైకి లేస్తే అది మరింత మధురంగా మారుతుంది మిత్రమా" అని గట్టిగా స్పందించింది.
Getting back up makes it all the more sweeter my friend . https://t.co/UgdW7GC8EZ
— Samantha (@Samanthaprabhu2) January 2, 2023
🫶🏻🫶🏻🫶🏻🫶🏻
— Samantha (@Samanthaprabhu2) January 2, 2023
Women Rising!! https://t.co/qR3N3OozK8
మరికొంతమంది అభిమానులకు కూడా సమంత రిప్లై ఇచ్చింది. "ఇటీవల జీవితం ఎలా ఉంది?" అని ఒక అభిమాని అడిగినప్పుడు, "డిఫరెంట్!!" అని రిప్లై ఇచ్చారు. మరో అభిమాని "నేను ఎల్లప్పుడూ మీ నమ్మకమైన అభిమానిని, మీ రక్షకుడిగా, మీ నమ్మకస్థుడిగా ఉంటాను. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీ పట్ల నా ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది మేడం." అని ట్వీట్ చేశాడు. దానికి ఆమె స్పందిస్తూ, "ఎప్పుడూ నా వెనుక ఉన్నందుకు ధన్యవాదాలు .. నేను ఇప్పటికీ కలిగి ఉన్న బలం మీ అందరి ప్రార్థనల కారణంగా ఉంది." అని రిప్లై ఇచ్చారు.
Different !! https://t.co/IPiCvvkCkQ
— Samantha (@Samanthaprabhu2) January 2, 2023
కొన్ని నెలల క్రితం సమంత మైయోసిటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఆమె తన మణికట్టుపై IV డ్రిప్‌తో మంచం మీద కూర్చున్న ఫొటోను షేర్ చేశారు. సమంత చివరిసారిగా యశోదలో కనిపించారు. ఇందులో ఆమె సరొగేట్ మదర్‌గా నటించారు. మెడికల్ క్రైమ్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆమె తదుపరి సినిమా పౌరాణిక చిత్రం శాకుంతలం. ఇక్కడ ఆమె టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. దుష్యంతుడిగా నటుడు దేవ్ మోహన్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కానుంది.