Samantha Instagram Story : బాబోయ్.. సమంతకు ఏమైంది? ఇంతకీ ఆ ఫోటో తనే షేర్ చేసిందా?
Actress Samantha : స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎలాంటి దుస్తులు లేకుండా ఉన్న పిక్ చూసి అందరూ షాకయ్యారు.
Actress Samantha Deleted Her Instagram Story Pics : సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ సత్తా చాటుతోంది అందాల తార సమంత. గత ఏడాది ఆమె నటించిన ‘శాకుంతలం’, ‘ఖుషీ’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఆ తర్వాత సమంత ఆన్స్క్రీన్పై పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ కాస్త తక్కువగానే దర్శనం ఇస్తోంది. నిజానికి ‘యశోద’, ‘శాకుంతలం’ సమయంలో ఆమె మయోసైటిస్ ఆటో ఇమ్యూనిటీ వ్యాధి తీవ్రం అయినట్లు టాక్ వినిపించింది. చికిత్స కోసం కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొండలు, కోనలు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ వ్యాధి నుంచి కోలుకునే ప్రయత్నం చేసింది. ‘ఖుషీ’ సినిమా తర్వాత బయట చాలా తక్కువగా కనిపిస్తోంది.
నెట్టింట వైరల్ అవుతున్న సమంత పిక్స్
తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది సమంత. అలాగే తన ఆరోగ్య సమస్య గురించి వివరిస్తూ ఇన్ స్టా స్టోరీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఒక ఫోటోలో ఒంటికి బాత్ టవల్ చుట్టుకుని చైర్ మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నట్లుగా ఉంది. ఇక రెండో ఫోటో బాత్ టబ్ లో కూర్చొని ఉంది. ఇందులో ఒంటిపై దుస్తులు లేకుండా కనిపించింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే సెకండ్ ఫోటో పెట్టిన వెంటనే డిలేట్ చేసినట్లు చెప్తున్నారు. సమంత ఇలాంటి ఫోటోలు పెట్టడం ఏంటని నెటిజన్లు, సినీ ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
మరోవైపు సమంత తాజా ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బాత్ టబ్ లో ఉన్న ఫోటో తనది కాదని కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది కావాలనే ఫేక్ ఫోటోను స్ప్రెడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆమె ఇన్ స్టా స్టోరీ పెట్టి వెంటనే డిలీట్ చేసిందంటున్నారు. మొత్తంగా సమంతా ఇన్స్టా స్టోరీ పిక్స్ డిలీట్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఫోటోలపై సమంత స్పందించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు చేస్తుంది. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ అనే ఓ పోస్టర్ ను షేర్ చేసింది. ఇందులో చీర కట్టుకొని, గన్ పట్టుకొని చాలా అగ్రెసివ్ గా కనిపించింది. అయితే, ఈ పోస్టర్ సినిమాకు సంబంధించినదా? లేక వెబ్ సిరీస్ కు సంబంధించినా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ ను సమంత తన సొంత బ్యానర్ త్రలాలా మూవీ పిక్చర్స్ ద్వారా నిర్మిస్తోంది.